తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం ఎత్తుకున్నారు ఎమ్మెల్యేలు.. మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మె్ల్యేలు అసమ్మతి గళం ఎత్తారు. మంత్రికి వ్యతిరేకంగా సమావేశమైన ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేక్, మైనంపల్లి, బేతి సుభాష్ రెడ్డి.. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని వాపోయారు.. మైనంపల్లి నివాసంలో సమావేశమైన ఐదుగురు నేతలు మల్లారెడ్డి అంశాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిచింది.. అయితే, ఎమ్మెల్యే సమావేశంపై స్పందించిన…
Today (20-12-22) Business Headlines: ‘ఏపీ బ్యాంక్’కి జరిమానా: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26 లక్షల రూపాయలకు పైగా జరిమానా విధించింది. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంకు.. రూల్స్ పాటించకపోవటంతో ఆర్బీఐ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. మరో 19 కోపరేటివ్ బ్యాంకుల పట్ల కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇందులో 17 బ్యాంకులు ఒక్క గుజరాత్‌కే చెందినవి కావటం గమనించాల్సిన విషయం.
ఎస్వీ వర్సిటీలో చిరుతల కలకలం.. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.. వర్సిటీలోని వీసీ బంగ్లాలోకి వచ్చి పెంపుడు కుక్కను చంపి ఎళ్తుకెళ్లింది చిరుత.. వీసీ బంగ్లా సమీపంలో రెండు చిరుతలు సంచరించడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు.. దీంతో, అధికారులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఒంటరిగా బయటకు రావద్దని విద్యార్థులకు ఆదేశాలు జారీ చేశారు.. ఇక, చిరుతల సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం…
గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు కారెక్కేశారు. అక్కడ కాంగ్రెస్ సీటు ఖాళీగా ఉందని భావించిన నాయకులు కర్చీఫ్‌లు వేస్తున్నారు. టికెట్ కోసం తన్నుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరి స్థాయిలో వారు కుంపట్లు రాజేస్తూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదెక్కడో.. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. పరస్పరం ఆధిపత్య పోరాటం కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టు ఉండేది. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచింది కూడా కాంగ్రెస్సే. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న వనమా…
తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. టీపీసీసీ కమిటీల ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన చీలిక అనేక మలుపులు తిరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా సీనియర్లు ఒక్కటయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈడీ ముందు హాజరుకానున్నారు. రోహిత్ రెడ్డి చేసిన అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. ఇవాళ ఉదయం రోహిత్ రెడ్డి తరపున ఆయన పీఏ శ్రవణ్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు.