కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి దిగ్విజయ్ తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు.
* నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న సీఎం జగన్ * హైదరాబాద్: నేడు ఉదయం 11.30 గంటలకు గాంధీ భవన్‌కు దిగ్విజయ్‌సింగ్.. టి.కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ.. ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడనున్న దిగ్విజయ్.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్‌మీట్ * హైదరాబాద్: నేటి నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శన * హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు బీఎల్ సంతోష్, జగ్గుస్వామి పిటిషన్లపై హైకోర్టులో…
చైనాలో కొత్త వేరియంట్ కల్లోలం.. భారత్‌లోకి ప్రవేశం చైనాలో కోవిడ్ -19 విజృంభనకు కారణం అవుతున్న ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ దేశంలోకి ప్రవేశించింది. తాజాగా భారత్ లో మూడు బీఫ్.7 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక బీఎఫ్.7 వేరియంట్ కేసులను బుధవారం వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో మొదటి బీఎఫ్.7 కేసును అక్టోబర్ లో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ గుర్తించింది. చైనాలో తీవ్రమైన కోవిడ్ కేసులకు ఈ ఒమిక్రాన్…
తెలంగాణ సర్కార్ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకం విజయవంతంగా అమలవుతుండగా.. కొత్తగా ‘కేసీఆర్ పౌష్టికాహార కిట్ల’ను రూపొందించింది. గర్భిణుల్లో రక్తహీనత అత్యధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో తొలి విడతగా వీటి పంపిణీని ప్రారంభించారు.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేటి నుంచి కిట్లు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.
రేపే వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే.. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా.. వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకంగా టికెట్లు తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటాను రేపు ఉదయం…
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ రానుంది. రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక సంస్థ త్వరలో 4,661 స్టాఫ్ నర్సుల నియామక ప్రకటన విడుదల చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 31లోపు ఈ నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
నేటి నుంచి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ.. ఇవాళ మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.. ఇవాళ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన.. విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభిస్తారు.. ఇక, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలోని నాలుగు లక్షల 60వేల మంది విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ జరగనుంది.. అంతేకాదు, హైస్కూళ్లలోని దాదాపు 60 వేల మంది టీచర్లకు కూడా…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. 1972 డిసెంబరు 21న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, విజయమ్మ దంపతులకు జన్మించిన ఆయన.. ఓవైపు వ్యాపారం చేస్తూనే.. రాజకీయాల్లోనూ రాణించారు.. 2009 మే నెలలో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు చేశారు.. 2014 ఎన్నికలలో పార్టీ ఓటమి పాలైనా, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికలలో…
* హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు.. పాల్గొననున్న సీఎం కేసీఆర్, ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్న అధికారులు * నేడు బాపట్ల జిల్లా యడ్లపల్లిలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీని ప్రారంభించనున్న సీఎం.. 4.59 లక్షల మంది విద్యార్థులు, 59,176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు…