తెలంగాణలో ప్రజారవాణా వ్యవస్థ బాగా మెరుగుపడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా అమలవుతున్న వివిధ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ల పై రాజ్య సభ లో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్చించారు. దీనికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌశల్ కిషోర్. హైదరాబాద్ మెట్రో కారిడార్ ఫేజ్ – 2 కింద తెలంగాణ సర్కారు మెట్రో ప్రొజెక్ట్ ను మొదలు పెడుతోందని తెలిపారు. ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టులో లో భాగంగా MMTS స్టేషన్లను కూడా కలుపుతోందని సమాధానం ఇచ్చారు. వరంగల్ నియో మెట్రో కింద 15.5 కిలోమీటర్ల కు 998 కోట్ల తో ప్రపోజల్ వచ్చిందన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ సూచించిన మార్పులతో మరోసారి ప్రపోజల్ పంపాలని సూచించామన్నారు కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్.
Read Also: Bigg Boss 7: బాలయ్యతో ‘బిగ్ బాస్ 7’
అయితే తెలంగాణ సర్కారు స్పందించలేదన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలకు సంబంధించి ప్రపోజల్స్ ఎలాంటివి రాలేదన్నారు మంత్రి. ఇదిలా ఉంటే.. ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణ పనులకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈనెల 9వ తేదీన సీఎం కేసీఆర్ ఎయిర్ పోర్ట్ మెట్రో పనులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆ పనులు వేగవంతమయ్యేలా అలైన్‌మెంట్ ఖరారు, గ్రౌండ్ డేటా సేకరణ, ఇతర పనులు తొందరగా చేసేందుకు రెండు సర్వే టీమ్స్‌ను ఏర్పాటు చేశామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో పిల్లర్లు, వయా డక్ట్, మెట్రో స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత ఉండాలనే విషయంలో ఈ డేటా కీలకమవుతుందని ఆయన అంటున్నారు. రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు ఉన్న ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గాన్ని హెచ్ఏఎంఎల్ సీనియర్ ఇంజనీర్ల టీమ్‌తో కలిసి ఆయన పరిశీలించారు.
మెట్రో స్టేషన్ల నిర్మాణం మెయిన్ రోడ్ జంక్షన్లకు దగ్గరగా ఉండాలని ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. ప్యాసింజర్లు రాయదుర్గం నుంచి తాము పనిచేసే ప్రాంతాలకు 20 నిమిషాల్లో చేరుకునేలా ఈ కారిడార్‌ను డిజైన్ చేస్తామన్నారు. మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ప్యాసింజర్ల వెహికల్స్ పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తామన్నారు. బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్‌ను ప్లాన్ చేసేటప్పుడు, ఇదే మార్గంలోనే భవిష్యత్తులో నిర్మించనున్న బీహెచ్ఈఎల్– – లక్డీకపూల్ మెట్రో కారిడార్ అవసరాలపై కూడా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మరిన్ని మెట్రో ప్రాజెక్టులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ చుట్టూ వందల కిలోమీటర్ల మేర మెట్రో రైలు రానుంది.
Read Also: Elon Musk: ఎలాన్ మస్క్‌కు యూజర్ల షాక్.. ట్విట్టర్ సీఈఓగా దిగిపోవాలని ఓటింగ్