నాకు కుప్పంతో ప్రత్యేక అనుబంధం ఉంది.. చెన్నైలో ఆదివారం జరిగిన ‘లత్తి’ (తెలుగులో లాఠీ) చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు హీరో విశాల్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. తనకు అక్కడ పోటీ చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. కుప్పం ప్రాంత ప్రజలతో తనకు అనుబంధం ఉన్న సంగతి నిజమే.. కానీ, తాను అక్కడినుంచి పోటీ చేస్తానన్న వార్తల్లో మాత్రం నిజం లేదని కుండబద్దలు కొట్టారు.. అయితే, తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమేనన్నారు విశాల్.. సామాజిక…
భర్తను దారుణంగా చంపేసింది ఓభార్య. భర్త వేధింపులు భరించలేక ఈ దారుణానికి పాల్పడింది. భర్త పరాయి మహిళలతో ఉండటమే కాకుడా..వారితో ఉన్న వీడియోలు తీసి భార్యకు చూపిస్తూ పైశాచికానందం పొందుతున్నాడు. ఈ వేధింపులు భరించలేక భార్య ఆవేశంతో భర్తను హతమార్చిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
Komuravelli Mallanna: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. కేతమ్మ, మేడల దేవి సమేత మల్లికార్జున స్వామి వారి కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కొమురవెల్లి మల్లన్న జాతరలో భాగంగా మంత్రి హరీశ్ రావు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోటి రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు.…
* నేడు ఈడీ విచారణకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి.. ఉదయం 10.30కి ఈడీ ఆఫీసుకి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి. * నేడు సిద్దిపేట జిల్లాలో ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన.. గజ్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు * ఇవాళ ఢిల్లీకి బండి సంజయ్.. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొననున్న బండి సంజయ్ * అనంతపురం: గుంతకల్ రైల్వే డివిజన్లో సిగ్నలింగ్ మరమ్మతుల కారణంగా నేటి…
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిర్యాలగూడలో తనకున్న ప్రతికూల పరిస్థితులపై దృష్టి పెట్టారు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి కారెక్కిన ఆయన.. 2018లో టీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు స్కెచ్ వేస్తున్నారు భాస్కరరావు. అయితే రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక.. నియోజకవర్గంలో ఆయనకు ఇంటా బయటా రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. కొత్తలో వాటిని భాస్కరరావు లైట్ తీసుకున్నా.. హ్యాట్రిక్ విజయానికి…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతు వేదికలను ప్రారంభించింది.. మండల కేంద్రాల్లో రైతులు సమావేశమై.. వారి సమస్యలు, పంటలు, రైతుబంధు.. ఇలా అనేక విషయాలను చర్చించుకునేందుకు వీలుగా ఈ వేదికలు నిర్మించింది ప్రభుత్వం.. ఇక, రైతు వేదికల వలె మహిళా వేదికలు కూడా నిర్మించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు.. రాష్ట్రంలో మహిళలను మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రైతు వేదికల మాదరిగా మహిళా వేదికలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని…
కాంగ్రెస్ సీనియర్లకు మల్లు రవి కౌంటర్.. కాంగ్రెస్ సీనియర్లకు కౌంటర్ ఇచ్చారు మరో సీనియర్ నేత మల్లు రవి.. ఏ కమిటీల్లో ఎవరి సంఖ్య ఏ స్థాయిలో ఉందే చెప్పుకొచ్చారు మల్లు రవి.. 22 మందితో ఉన్న పీఏసీ కమిటీలో రేవంత్‌రెడ్డి మినహా టీడీపీ నుండి వచ్చినవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేసిన ఆయన.. ఇక, 40 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇద్దరే టీడీపీ నుండి వచ్చినవాళ్లు ఉన్నారు.. ఉపాధ్యక్ష పదవిలో 24 మందిలో ఐదుగురు టీడీపీ…