2024 ఎన్నికల తర్వాత ఏపీలో ఆ ప్రాంతీయ పార్టీ కనుమరుగు..! అది ఏ పార్టీ..? 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్ధన రెడ్డి.. తిరుమలలో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు.. ఇక, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతుందని జోస్యం చెప్పారు.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్…
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. ఓవైపు సీబీఐ విచారణ కొనసాగుతుండగానే.. మరోవైపు కోర్టులో కూడా విచారణ సాగుతోంది.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారామె.. అయితే, ఈ కేసు రేపు విచారించనుంది…
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ రోజే ఆ టికెట్లు అన్ని విడుదల.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం రానే వచ్చింది.. జులై మాసానికి సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు.. వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను ఈ రోజు ఆన్లైన్లో పెట్టనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ రోజు ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించి లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది.. ఇక, ఉదయం…
Chaitra Amavasya: చైత్ర అమావాస్య నాడు ఈ స్తోత్రాలు వింటే ఇహపరలోకాల్లో నరక బాధలుండవు. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జిల్లా జడ్జీలను హైకోర్టు బదిలీ చేసింది. వార్షిక బదిలీల్లో భాగంగా పెద్ద సంఖ్యలో జిల్లా సెషన్స్ జడ్జీలను ట్రాన్స్ పర్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 41 మంది డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జీలను బదిలీ చేసింది.
Mega Job Fair: సీనియర్ రాజకీయ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోమ్ మంత్రివర్యులు మరియు రాజ్య సభ సభ్యులు తూళ్ల దేవేందర్ గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా నిరుద్యోగులకు శుభవార్త చెబుతున్నారు.. దేవేందర్‌గౌడ్ 70వ పుట్టిన రోజు సందర్భంగా ఏడాది పొడవునా పుట్టినరోజు వేడుకులు జరుగుతోన్న నేపథ్యంలో.. ఆ వేడుకలలో భాగంగా మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నారు.. మహేశ్వరం నియోజకవర్గంలోని యువతి యువకులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కుమారులు కోరుతున్నారు. ఇంతకీ, ఆ…
టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల వివరాలు తమతో చర్చించకుండా కార్యచరణ రూపొందిస్తారని మండి పడ్డారు.