చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా తర్వాత యువకుల్లో గుండెపోటులు ఎక్కువయ్యాయి.
మూలపేట పోర్టుకు శంకుస్థాపన.. ప్రత్యేక ఏంటి? శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు.. సంతబొమ్మాళి మండలం మూలపేటకు వెళ్లనున్న ఆయన.. మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్నారు.. దీనికోసం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్లనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. విశాఖపట్నం నుండి చాపర్ లో శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంటారు.. ఉదయం 10.15 గంటలకు మూలపేట చేరుకోనున్న ముఖ్యమంత్రి.. ఉదయం 10.30 – 10.47 గంటల మధ్య…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 60 వేలు దాటింది. భారత్‌లోనూ కరోనా భయపెడుతోంది. రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
సీపీఐ ప్రజా పోరు యాత్రలో భాగంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంచిర్యాల తాండూరు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక ఐక్యతను సాధించడంలో కేసీఆర్ ఫెయిల్ అవుతున్నాడన్నారు. కేంద్రంతో కేసీఆర్ పోరాటం మంచిదే కానీ ముందుగా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు.
ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగు పడింది. జనగామ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది.
నిర్మల్ పట్టణ శివారులో రూ.5.35 కోట్లతో నూతనంగా నిర్మించిన ఈద్గాను ప్రారంభించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
నారాయణపేట జిల్లా బోయిన్ పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ముగ్గు చిన్నారులు సహా ఓ మహిళ మృతి చెందారు. చెరువులో మునిగిపోతున్న పిల్లలను కాపాడే ప్రయత్నంలో తల్లి సురేఖ కూడా ప్రాణాలు కోల్పోయింది.
చోరీకి గురైనా లేదా పోగొట్టుకున్న సెల్ఫోన్ల జాడను తెలుసుకునేందుకు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) అనే విధానాన్ని కొత్తగా ప్రవేశ పెడుతున్నట్టు డీజీపీ అంజనీ కుమార్ ప్రకటించారు.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.