సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని బీఆర్ఎస్ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీలో ఉన్నోళ్లకు గులాంగిరి చేస్తారని, బీజేపీ వాళ్లు గుజరాత్ పెద్దలకు గులాంగిరి చేస్తారని.. కానీ బీఆర్ఎస్ వాళ్లు తెలంగాణ ప్రజలకు గులాం గిరి చేస్తారని మంత్రి అన్నారు.
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య.. అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.. గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం పనిచేస్తున్న వీర సాయిష్ని నిన్న రాత్రి కాల్చి చంపారు దుండగులు.. ఆ విద్యార్థి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు… ఉన్నత చదువుల కోసం (ఎమ్మెస్) అమెరికా వెళ్లిన సాయిష్ ప్రాణాలు ఇలా పోవడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇండియాకు చెందిన ఇద్దరు తెలుగు యువకుల మృతిలో పాలకొల్లుకు చెందిన సాయిష్ ఒకరు.. మరో నెలరోజుల్లో…
బెజవాడలో ప్రైవేట్ బస్సు బోల్తా విజయవాడలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది.. గొల్లపూడి సమీపంలో ఈ ఘటన జరిగింది.. విజయవాడ నుంచి హైదరబాద్ వైపు వెళ్తున్న BSR ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది.. టిప్పర్ లారీ వచ్చి బస్సును ఢీ కొనడంతో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.. ప్రమాద సమయంలో సుమారుగా 30 మంది బస్సుల్లో ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తోంది.. వీరిలో దాదాపు 20 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు..…
డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్నీ అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యావిధానం-2020ని అనుసరించి, ఉన్నత విద్యలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.
నాంపల్లి ఏరియా హాస్పిటల్ లో 5 పడకల డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్ ను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వంలో 3 నుంచి 102 కు పెంచాము అని ఆయన వెల్లడించారు.