MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
- 1,931 పోస్టులకు తొలి ప్రొవిజనల్ జాబితా
- అభ్యంతరాల పరిశీలన తర్వాత తాజా లిస్ట్
- జూలై 13 నుంచి 15 వరకు అవకాశం
- MHSRB వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MHSRB: తెలంగాణలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) లేదా ఏఎన్ఎం పోస్టుల భర్తీ ప్రక్రియలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) కీలక అడుగు వేసింది. మొత్తం 1,931 పోస్టుల భర్తీకి సంబంధించి రూపొందించిన తొలి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను బోర్డు శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. అంతకుముందు మే 14న అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కులు, కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ సేవలకు సంబంధించిన వెయిటేజ్ మార్కులతో కూడిన ప్రాథమిక జాబితాను విడుదల చేసి, మే 18 నుండి మే 22 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఆయా అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించిన అనంతరం బోర్డు ఈ తాజా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను ప్రకటించింది.
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
ఈ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటించేందుకు గానూ, అభ్యర్థుల నుండి మరోసారి అభ్యంతరాలను స్వీకరించాలని బోర్డు నిర్ణయించింది. ఇప్పుడు విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌పై ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. వారు జూలై 13 నుండి జూలై 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు MHSRB వెబ్సైట్లో తమ లాగిన్ వివరాల ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది. అయితే, ఈ అభ్యంతరాలను ఒక్కసారి మాత్రమే నమోదు చేసే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు ఎలాంటి తప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!