Vizag Crime: తల్లికి టీలో మత్తు ఇచ్చి.. బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది.. తెలంగాణలోని భువనగిరి జిల్లాకు చెందిన ఓ తల్లికి విశాఖ రైల్వేస్టేషన్‌లో టీ ఇచ్చిన ఓ జంట.. ఆ తర్వాత ఆమె ఏడాదిన్నర కొడుకును ఎత్తుకెళ్లారు.. విశాఖ రైల్వే స్టేషన్ లో గురువారం జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.. యాదాద్రి జిల్లా నుండి నిన్న రాత్రి రైల్లో ఏడాదిన్నర కుమారుడుని తీసుకుని ఓ గర్భిణీ విశాఖకు చేరుకుంది. రాత్రి నుండి విశాఖ రైల్వే స్టేషన్‌లోనే ఉండిపోయింది.. అయితే, ఏడాదిన్నర బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. తనతో పాటు స్టేషన్ లోనే ఉన్న ఒడిశాకు చెందిన ఓ జంట తన కొడుకుని కిడ్నాప్ చేసి ఉంటారని ఆ గర్భిణీ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేపట్టారు..
Read Also: Shark Attack: తండ్రి ముందే కొడుకును చంపి తిన్న షార్క్.. వైరల్ అవుతున్న భయంకర వీడియో..
ఇక, ఈ ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కిడ్నాప్‌నకు గురైన బాలుడు తల్లి భవాని.. నాది తెలంగాణలోని భువనగిరి జిల్లా.. నా భర్త నన్ను హింసించి నా కొడుకుని చంపేస్తా అని బెదిరించాడు.. దీంతో, నాకు భయం వేసి ట్రైన్ ఎక్కి విశాఖకు వచ్చాను.. విశాఖ రైల్వేస్టేషన్‌లో నేను రైలు దిగిన తరువాత ఫ్లాట్ నంబర్ 8 వద్ద.. నేను, నా కొడుకు ఉన్నాం.. అయితే, ఓ జంట నా దగ్గర కి వచ్చి మాటలు కలిపారు.. నాకు తాగడానికి టీ ఇచ్చారని తెలిపింది.. ఇక, టీ తాగిన తర్వాత ఏం జరిగిందో తెలియదు నాకు నిద్ర వచ్చింది.. మత్తులో ఏం జరుగుతుందో తెలియకుండా పోయింది.. మెలుకువ వచ్చే సరికి నా వద్ద నా బాబు లేడని గొల్లుమంది.. ఆ జంట తనతో ఒడియాలో మాట్లాడరని తెలిపిన మహిళ.. పోలీసులు నా బాబుని నాకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.