ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగు పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. దీంతో మరో వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
భానుడి ప్రతాపంతో ఉక్కపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్లు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిని వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బెజవాడకు సూపర్ స్టార్.. వేదిక పంచుకోనున్న చంద్రబాబు, రజనీ, బాలయ్య.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మన విజయవాడకు త్వరలోనే రాబోతున్నారు.. ఈ నెల 28వ తేదీన బెజవాడలో పర్యటించనున్నారు. రజనీకాంత్ విజయవాడకు వస్తున్నారంటే ఏదో సినిమా షూటింగ్ కావొచ్చు అని లైట్ తీసుకోకుండి.. ఎందుకంటే.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు రజనీ.. బెజవాడ పొరంకిలోని అనుమోలు గార్డెన్ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఇక, ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత,…
కొనసాగుతోన్న కౌంట్‌డౌన్.. నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ -సీ55.. మరో ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO).. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలతో పాటు.. వాణిజ్య ప్రయోగాలను కూడా చేసి విజయం సాధించింది.. ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయ్యింది.. ఈ రోజు శ్రీహరికోటలోని షార్ (SHAR) మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్ఎల్వీ-సీ 55 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన రెండు ఉపగ్రహాలకు కక్ష్యలో ప్రవేశపెట్టనుంది..…