సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోఆరెకటిక సంఘం నూతన భవనానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ ఆసుత్రుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు.
Cyber Scam: మల్టీ లెవెల్ మార్కెటింగ్‌లో చేరి చాలా మంది మోసపోతున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. వైన్ కంపెనీలో పెట్టుబడి పెట్టండి.. మీరు వైన్ బాటిల్ కొనుక్కోండి.. 60 రోజుల్లో మూడు రెట్లు ఇస్తాం.. మీరు చేరితే నెల జీతం ఇస్తామని కొందరు చేసిన ప్రకటనను గుడ్డిగా నమ్ముతున్నారు.
Weather: తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ద్రోణి కారణంగా నగరంలో పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి.
తెలంగాణాలో ఈ మధ్య వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఈ ప్రమాధాలలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. నిన్న ఘోర రోడ్డు ప్రమాధం జరిగింది.. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయ్యారు.. ఇక ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి.. తాజాగా కరీంనగర్ లో ఘోరం జరిగింది.. పోలీసుల నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో యువకుడు బస్సును ఢీ కొట్టాడు. ఈ క్రమంలో వ్యక్తి ప్రాణాలను కోల్పోయిన ఘటన స్థానికంగా కలచి వేసింది.. వివరాల్లోకి వెళితే.. తెలంగాణక రీంనగర్‌లో పోలీసుల…
Malaysia: బ్రోకర్ మాటలు నమ్మి మోసపోయారు ఖమ్మం జిల్లా వాసులు. ఎర్రుపాలెం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన 20 మందిని విడతల వారీగా మలేషియా తీసుకెళ్లాడు బ్రోకర్ నాగబాబు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన నాగబాబు … మధిర నియోజకవర్గంలోని రాజుపాలెం గ్రామానికి చెందినవారిని మోసగించాడు. ఒక్కొక్కరి నుంచి రెండు, మూడు లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి టూరిస్ట్ వీసాలు ఇప్పించాడు. అవే వర్క్ పర్మిట్ వీసాలుగా భావించి మలేషియా వెళ్లారు. ఇలా వెళ్లినవారంతా…
పాలంపేటలో ఉండే యూనేస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని కేటీఆర్ సందర్శించారు. అనంతరం రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన.. ఆలయ విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నాడు. అంతేకాకుండా అక్కడి నుంచి రామప్ప చెరువుకు వెళ్లి బోటింగ్ చేశారు. అనంతరం చెరువులోకి వచ్చే గోదావరి జలాలకు మంత్రి కేటీఆర్ పూజలు చేశారు. అంతేకాకుండా స్థానిక మత్స్యకారులతో కాసేపు ముచ్చటించారు.
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వచ్చే 48 గంటల్లో కేరళలోకి రుతుపవానాలు ప్రవేశించనున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.