తెలంగాణ రాష్ట్రంలో నాన్ క్యాడర్ ఎస్పీలు బదిలీలు అయ్యారు. 15 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31 లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకే జిల్లాలో మూడేళ్ల పాటు పనిచేసిన డిఎస్పీలను, అడిషనల్ ఎస్పీలను, నాన్ క్యాడర్ ఎస్పీలను, స్వంత జిల్లాలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరికొన్ని బదిలీలు జరిగే అవకాశాలున్నాయి.
Indian 2 OTT Rites : భారీ మొత్తానికి కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ..?
బదిలీలు అయిన వారిలో వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీగా పి రవీందర్, సైబరాబాద్ ఎస్ఓటి డీసీపీగా అబ్దుల్ రషీద్, రాచకొండ ఉమెన్స్ సేఫ్టీ డీసీపీగా ఉషారాణి, రాచకొండ క్రైమ్స్ డీసీపీగా అరవింద్ బాబు, ఎల్బీనగర్ ట్రాఫిక్ డీసీపీగా శ్రీనివాసులు ఉన్నారు.