పోలీసులపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ మ్యానువల్ పాటించకుండా చట్టాన్ని తుంగలో తొక్కి.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా క్షేత్రస్థాయిలో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రజల భావ వ్యక్తీకరణను అడ్డుకొని భయభ్రాంతులకు గురి చేయాడాన్ని ఆయన ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు పాదయాత్ర చేసిన ప్రతి గ్రామంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెడుతున్న తప్పుడు కేసుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారని భట్టి పేర్కొన్నారు.
Ration Dealers: సమ్మె కొనసాగింపుపై రేషన్ డీలర్లు వెనక్కి తగ్గారు. దీంతో రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపులు తెరుచుకోనున్నాయి. ఇంతకు ముందు రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. కనీస గౌరవ వేతనంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్యవేదిక సమ్మె బాట పట్టింది. Read Also: R Krishnayya: బీసీల్లోని 6 కులాలకే రూ. లక్ష ఇస్తోంది: ఆర్ కృష్ణయ్య డీలర్లు చనిపోతే…
జియో వినియోగదారులకు శుభవార్త అందించింది ఆ సంస్థ. ఇప్పటికే తెలంగాణలో కొన్ని చోట్ల జియో ట్రూ 5జీ సేవలు కొనసాగుతుండగా.. ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో అందించేందుకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 850కిపైగా ప్రధాన ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రిలయన్స్ జియో తెలిపింది.
కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపడం కేసీఆర్ నీవల్ల కాదు కదా! మీ తాత వల్ల కూడా కాదు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నీలాంటి కేసీఆర్ లను వందల మందిని కాంగ్రెస్ చూసింది.. నిన్నే మూడు చెరువుల నీళ్లు తాపించి మూడు నెలల్లో బంగాళాఖాతంలో ముంచుతాం.. ఇక కాస్కో ఖబర్దార్ అంటూ సవాల్ విసిరారు.
ఈరోజుల్లో మనుషుల మధ్య మానవత్వం లేదు.. సంబంధ బాంధవ్యాలు కూడా సరిగ్గా ఉండటం లేదు.. డబ్బులు సంపాదించాలనే కోరిక తప్ప బంధం, బంధుత్వం అనేది లేకుండా పోయింది.. డబ్బుల కోసం సొంతవాళ్ళను సైతం పొట్టన పెట్టుకుంటున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా తెలంగాణాలో మరో దారుణం జరిగింది.. ఆస్తి కోసం సొంత అన్ననే అతి కిరాతకంగా చంపాడు ఓ తమ్ముడు ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కి పడింది.. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ జగిత్యాల…
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇప్పటికే చాలా పేపర్లు లీక్ అయిన తర్వాత కూడా అదే సిబ్బందితో పరీక్ష నిర్వహిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
కేసీఆర్ అతని కుటుంబ సభ్యులు నలుగురికి ఉద్యోగాలు కల్పించి రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం మరిచారు అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శలు గుప్పించాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభవార్త.. కోడిగుడ్ల ఉత్పిత్తిలో ఏపీ నెంబర్‌వన్‌గా నిలిచినట్లు తాజాగా విడుదలైన కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ సర్వే 2022 వెల్లడించింది.
పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ చేస్తున్న కృషికి మరో జాతీయ గుర్తింపు దక్కింది. అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తన ‘ది స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ 2023: ఇన్ ఫిగర్స్’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.