బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 15న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. సభకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ముఖ్యఅతిథిగా అమిత్ షా హాజరవుతారని వెల్లడించారు.
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతవరణం వేడెక్కుతోంది. ఇప్పటికే అధికార పార్టీ తమ వ్యూహాలకు పదునుపెట్టగా.. ప్రతిపక్షాలు తమదైన శైలిలోకి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని పావులు కదుపుతోంది.
కాంగ్రెస్ పార్టీలో పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ భవిష్యత్‌కు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అంటూ.. హైదరాబాద్ సోమాజిగూడలోని కత్రియా హోటల్లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో ఆయన పాల్గొని రేవంత్ రెడ్డి మాట్లాడారు.
రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ, రెవెన్యూ, టీ-సెర్, మహిళ, ట్రాన్స్ జెండర్ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని ప్రసంగించారు.
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంతోనో, మాటలతోనో వార్తల్లో ఉండే నాయకుడు జగ్గారెడ్డి. ఎందుకో.. గత కొన్ని నెలలుగా మ్యూట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారాయన. మాటలే కాదు.. ఆయన ఎవరికీ కనిపించడం కూడా లేదట. ఎందుకన్నది ఎవరికీ తెలియడం లేదట. అందుకే ఆ మౌనానికి అర్ధాలు, నానార్ధాలు, విపరీతార్ధాలు వెదికే పనిలో ఉన్నారట గాంధీభవన్‌లో కొందరు. చాలా రోజుల నుంచి మౌనముద్రలో ఉన్నారు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అడపా దడపా…
పవన్‌పై మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు.. కాపుల భావన అదే.! జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కాపు కులాన్ని మళ్లీ ముంచేందుకు ప్రయత్నం చేస్తున్నారని కాపు సామాజిక వర్గం భావిస్తోందన్నారు. పవన్ కల్యాణ్ అందలం ఎక్కితే బాగుంటుందని కాపు కులంలోని యువత, పెద్దలు అభిప్రాయ పడుతున్నారు… కానీ, పొత్తు నిర్ణయాలతో పార్టీని అధః పాతాళంలోకి తొక్కేసారని అంతా భావిస్తున్నారని పేర్కొన్నారు.. గోదావరి జిల్లాలలో 14 తేదీ నుంచి…