ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం.. శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్.. కృష్ణాయపాలెం చేరుకున్న తర్వాత కృష్ణాయపాలెం లేఅవుట్‌లో పైలాన్‌ను ఆవిష్కరించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.. ఇక, వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు ఏపీ సీఎం.. శంకుస్థాపన చేసిన అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు ముఖ్యమంత్రి.. ఆ తర్వాత మోడల్ హౌజ్‌ను పరిశీలించారు.. కాగా, కృష్ణాయపాలెం లేఅవుట్‌లో 50,793 ఇళ్ల నిర్మాణాలకు పూనుకుంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఈ ఇళ్ల నిర్మాణానికి రూ.1,829.57 కోట్లు వెచ్చించనుంది. ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో వ్యయంతో అన్ని మౌలిక వసతులతో 50,793 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.. సీఆర్‌డీఏ పరిధిలోని గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లే అవుట్‌లో ఈ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. గూడు లేని పేద అక్కచెల్లెమ్మలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.
చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే రోజు ఇది.. ఇక నుంచి సామాజిక అమరావతి
చరిత్రలోనే ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోయే రోజు.. ఇక నుంచి సామాజిక అమరావతి.. మన అందరిది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సీఆర్డీఏ పరిధిలోని కృష్ణాయపాలెం లేఅవుట్‌లో పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్, వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.. ఆ తర్వాత పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ, మోడల్ హౌస్‌ను పరిశీలించారు.. ఇక, వెంకటపాలెంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తే రాజధాని అభివృద్ధి చెందదని కొందరు వాదించారు.. పేరుకు ఇది రాజధాని.. అలాంటిది పేదలు ఇక్కడ ఉండకూడదా? అని ప్రశ్నించారు. అందుకే.. ఇప్పుడు పేదలకు అండగా మార్పు మొదలైంది. అమరావతిని సామాజిక అమరావతిగా మారుస్తున్నాం.. ఈ రోజు దానికి పునాది రాయి వేస్తున్నా.. ఇక నుంచి అమరావతి మన అందరిది అంటూ వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా ఎంతో మంచి చేశామని తెలిపారు సీఎం జగన్.. గత ప్రభుత్వం చేయని మంచిని నాలుగేళ్లుగా చేసిచూపించామన్న ఆయన.. మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలని కోరారు.. అక్క చెల్లెమ్మల సాధికారతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాం..అన్ని సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం..అక్క చెల్లెమ్మలకు ఇస్తున్న ఇంటి విలువ రూ.7.5 లక్షల వరకు ఉంటుందన్నారు.. పేదలకు అండగా మార్పు మొదలైంది.. సామాజిక అమరావతిగా మార్పుకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోయింది? అని నిలదీశారు సీఎం జగన్.. మంచి చేసే కార్యక్రమాన్ని అడ్డుతగలడమే వీరి లక్ష్యం అంటూ మండిపడ్డారు. నా అక్క చెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం.. కోర్టు కేసులతో దీనినీ అడ్డుకునేందుకు ప్రయత్నించారని విరుచుకుపడ్డారు. పెత్తందారులపై పేదవాడు సాధించిన విజయం ఇది.. చరిత్ర ఉన్నంతవరకు ఇవాళ మరిచిపోలేని రోజుగా అభివర్ణించారు.
మునిగిన పడవపై పవన్, చంద్రబాబు.. మేం సపోర్ట్ చేయం..!
పవన్ కల్యాణ్, చంద్రబాబు రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. మునిగిన పడవపై ప్రయాణం చేస్తున్నారు.. మేం పవన్, చంద్రబాబుకు సపోర్ట్ చేయబోమని స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. తిరుపతిలోని పద్మావతి పురంలో ఏబీ బర్ధన్ కమ్యూనిటీ భవన్ ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల బలం తగ్గడంతో పార్లమెంటులో ప్రజల సమస్య పరిష్కారం కావడం లేదన్నారు.. మణిపూర్ లో యాభై వేల ఎకరాల భూమిని బీజేపీ ఆదానికి అప్పగించిందని.. గిరిజనులను బ్లాక్ మెయిల్ చేసి, అరాచకాలు చేసి లొంగ దీసుకుంటున్నారని.. పోలీసుల సమక్షంలో కార్గిల్ వీరుడిగా ఉన్న ఓ నాయకుడి భార్య, కుమార్తెను అత్యాచారం చేసి చంపేశారని.. బీజేపీ కుట్రపూరితంగా మణిపూర్ ను మండిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎంతో విలువైన భూమిని కార్పోరేటర్ సంస్ధలకు అప్పగిస్తున్నారు.. పార్లమెంటులో 24 మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.. బీజేపీ దేశంలో అరాచకాలను సృష్టిస్తుందన్నారు. ఇక, ఏపీ సీఎం వైఎస్ జగన్.. బీజేపీతో కలిసే ఉన్నారని ఆరోపించారు నారాయణ.. మరోవైపు పవన్ కల్యాణ్, టీడీపీ కలిసి రాజకీయం చేయడం మొదలు పెట్టారు.. రాయలసీమ అభివృద్ధికి యాభై కోట్లు ఇస్తానని చెప్పి ఒక్క కోటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ఏపీ ప్రజలకు బీజేపీ అన్యాయం చేసిందన్న ఆయన.. మునిగిన పడవపై పవన్, చంద్రబాబులు ఉన్నారు.. పవన్, చంద్రబాబులు రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. వారికి మేం ఎప్పుడూ సపోర్ట్ చేయబోమని స్పష్టం చేశారు. బీజేపీతో ఉండాలని ఎవరి ప్రయత్నం చేసినా తెలుగు ప్రజలకు ద్రోహం చేసినవాళ్లే అన్నారు నారాయణ.. ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించగానే మా మద్దతు ఎవరికి అనేది ప్రకటిస్తామని వెల్లడించారు.
పవన్ కల్యాణ్ పిచ్చికుక్క.. పెళ్లాలనే కాదు.. పార్టీలను కూడా మారుస్తాడు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లాలనే కాదు.. పార్టీలను కూడా మారుస్తాడు అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్.. వెంకటపాలెంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ చరిత్రను తిరగ రాస్తున్నారు.. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉండాలంటే చంద్రబాబు సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని అన్నాడు.. కానీ, రాజధానిలో జగన్ 50 వేల మందికి ఇళ్లు కట్టిస్తున్నారు.. పెత్తందార్ల పక్కన పేదలు ఉండకూడదని కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. కుక్కలకు కూడా సీజన్ ఉంటుంది.. చిత్తకార్తి సమయంలో కుక్కలు కూడా రోడ్డు మీదకు వచ్చి మొరుగుతాయి.. ఇటువంటి చిత్తకార్తి కుక్కలు ఎన్నికల సీజన్ లో రోడ్డు మీదకు వస్తున్నాయి అంటూ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు ముసలి నక్క , పవన్ కల్యాణ్ పిచ్చికుక్క, పవన్ కల్యాణ్ పెళ్లాలనే కాదు పార్టీలను కూడా మారుస్తాడు అంటూ ఫైర్ అయ్యారు. మార్చటం, తార్చటం పవన్ కల్యాణ్ వెన్నతో పెట్టిన విద్య అన్న ఆయన.. ఢిల్లీలో విగ్గు రాజుతో కలిసి కంపెనీ పెట్టు.. ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలో కంపెనీ పెట్టు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పేదలకు అన్నం పెడుతున్నాడు.. గూడు కల్పిస్తున్నాడు.. జగన్ ను ఎవరూ టచ్ కూడా చేయలేరన్నారు. మా వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఊరపంది తిరిగినట్లు ఒకడు రోడ్ల పై తిరుగుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్.
రైతుల పంట పండింది.. కందులకు రికార్డు ధర..!
వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్‌లో కందులు, కందిపప్పు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా క్వింటాల్ మాంసం ధర రూ. 10,787 చెప్పారు. పప్పుల ధర రూ. 15 వేలకు పైగా ధర పలుకుతోంది. మార్కెట్‌లో కోడిగుడ్లకు కనీస మద్దతు ధర రూ. 6,600 కాగా, రికార్డు రూ. 10వేలకు పైగా పలుకుతుండటం విశేషం. తాండూరు వ్యవసాయ మార్కెట్‌లో ఈ ఏడాది 59,800 క్వింటాళ్ల కందులు విక్రయించారు. గరిష్టంగా రూ. 8,759 వ్యాపారులు కొనుగోలు చేశారు. నెల రోజుల క్రితం వరకు కూడా కందులు క్వింటా రూ. 8,500 అన్నారు. క్వింటా పప్పు రూ. 12 వేల వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం సీజన్ దాటిపోవడంతో మాంసానికి డిమాండ్ పెరిగింది.
పేపర్ లీకేజీ కేసులో బిగ్ ట్విస్ట్.. సిట్ అదుపులో మరో 15 మంది..
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పేపర్ లీక్ ఘటనపై నిరుద్యోగులతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు అధికార ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముందుగా ఈ పేపర్ లీకేజీ ఉదంతం వెలుగులోకి రాగానే అందులో పాల్గొన్న వారందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులు తమ సిమ్ కార్డులు తీసుకుని పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. ఆ తర్వాత పోలీసులకు పట్టుబడి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పుడు పట్టుబడతామంటూ హడావుడి చేసిన నిందితులు.. తప్పించుకోలేరనే ఉద్దేశ్యంతో తప్పు చేశారంటూ ఇప్పుడు సిట్ ఎదుట లొంగిపోయే పరిస్థితి నెలకొంది. అయితే.. 20 రోజుల వ్యవధిలో 15 మంది తమ నేరాన్ని అంగీకరించారని సిట్ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 90 మంది నిందితులను అరెస్టు చేయగా.. నెలాఖరులోగా మరో పది మందిని అరెస్టు చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది మార్చి నెలలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ అయినట్లు బేగంబజార్ పోలీసులకు సమాచారం అందింది. గతంలో 12 మందిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కమిషన్ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని సూత్రధారిగా నియమించారు.
కేటీఆర్ బర్త్ డే కి అలా చేద్దామని అనుకున్నాడు కానీ.. కొడుకు ట్విట్టర్ వైరల్
మంత్రి కేటీఆర్ ఈరోజు 47 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ సందడి చేస్తున్నాయి. రోడ్లపై ఫ్లెక్సీల ఏర్పాటుతో పాటు కేక్‌లు కట్ చేసి తమ అభిమాన నాయకుడి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. అలాగే ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, అభిమానులు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ కేటీఆర్ తనయుడు హిమాన్షురావు మాత్రం తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా 24న ‘ప్రెట్టీ’ అనే పాటను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఆ పాట కోసం బీఆర్ఎస్ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి 10.33 గంటలకు హిమాన్షు చేసిన ఓ అనూహ్య ట్వీట్ పాట కోసం ఎదురుచూస్తున్న వారిని నిరాశపరిచింది. సాంకేతిక కారణాల వల్ల ‘ప్రెట్టీ’ పాట విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలిపారు. మరో తేదీన పాటను విడుదల చేస్తామని, సాంకేతిక సమస్యలు పరిష్కరించిన తర్వాత పాట విడుదల తేదీని ప్రకటిస్తామని హిమాన్షు ట్విట్టర్‌లో వెల్లడించారు. హిమాన్షు ట్వీట్‌పై బీఆర్‌ఎస్ కార్మికులు కామెంట్స్ చేస్తున్నారు. ఆ పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించాడు. మరికొందరు అభిమానులు ‘హ్యాపీ బర్త్ డే కేటీఆర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఒకేసారి ఏడు ఉపగ్రహాలు నింగిలోకి..
ప్రపంచం మొత్తం ఆసక్తిగా భారత్‌వైపు చూసేలా చేసినా ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత మరో భారీ ప్రయోగానికి సిద్ధం అవుతోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. చంద్రునిపైకి వెళ్లే మార్గంలో చంద్రయాన్-3 మిషన్‌ను ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత, ఇస్రో తన తదుపరి భారీ ప్రయోగానికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది.. భారత అంతరిక్ష సంస్థ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C56) మిషన్‌ను ఈ నెల 26వ తేదీన ప్రయోగించనుంది. PSLV-C56 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి DS-SAR ఉపగ్రహం సహా మరో ఆరు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.. DS-SAR సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీల ఉపగ్రహ చిత్రాల అవసరాలకు మద్దతు ఇస్తుంది. ST ఇంజనీరింగ్ యొక్క వాణిజ్య వినియోగదారుల కోసం బహుళ-మోడల్ మరియు అధిక ప్రతిస్పందనాత్మక చిత్రాలను మరియు జియోస్పేషియల్ సేవలను అందిస్తుంది. DS-SARతో పాటుగా ఆరు ఉపగ్రహాలు ఉన్నాయి, వీటిలో VELOX-AM, 23 కిలోల సాంకేతిక ప్రదర్శన మైక్రోసాటిలైట్; ARCADE, ఒక ప్రయోగాత్మక ఉపగ్రహం; SCOOB-II, టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ పేలోడ్‌తో కూడిన 3U నానోశాటిలైట్; NuSpace ద్వారా NuLION, పట్టణ మరియు మారుమూల ప్రాంతాలలో అతుకులు లేని IoT కనెక్టివిటీని ప్రారంభించే అధునాతన 3U నానోశాటిలైట్; గెలాసియా-2, ఒక 3U నానోశాటిలైట్ తక్కువ భూమి కక్ష్యలో కక్ష్యలో ఉంటుంది; మరియు ORB-12 STRIDER, అంతర్జాతీయ సహకారంతో అభివృద్ధి చేయబడిన ఉపగ్రహం. జూలై 14, 2023న చంద్రయాన్-3 చంద్రుని మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన తర్వాత ఈ రాబోయే మిషన్ ఇదే. జులై 30వ తేదీన 6.30 గంటలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేయనున్నట్టు ఇస్త్రో ప్రకటించింది..
జ్ఞానవాపి సర్వే 2 రోజులు వద్దు.. పురావస్తు శాఖకు సుప్రీం ఆదేశం
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జులై 26 వరకు ఎలాంటి సర్వే నిర్వహించవద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. పరిష్కారాల కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని ముస్లిం పిటిషనర్లను ఆదేశించింది. మసీదు నిర్వహణ కమిటీకి చెందిన ముస్లిం పిటిషనర్లు ముందుగా ఉన్న ఆలయంపై మసీదును నిర్మించారా అనే దానిపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే కోసం వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అలహాబాద్ హైకోర్టులో వారణాసి కోర్టు ఏఎస్‌ఐ ఆదేశాలను సవాలు చేయడానికి జ్ఞాన్‌వాపి మసీదు నిర్వహణ కమిటీకి కొంత సమయాన్ని ఇచ్చింది. ఈరోజు మసీదు ప్రాంగణంలో సర్వే చేసేందుకు 30 మంది సభ్యుల బృందాన్ని పంపిన ఏఎస్‌ఐకి తన ఆదేశాలను తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ తరఫు సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ మాట్లాడుతూ.. నిర్మాణ ప్రాంగణంలో ఏఎస్‌ఐ సర్వేకు సంబంధించి జిల్లా కోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని అన్నారు. వారణాసి జిల్లా కోర్టు ఏఎస్‌ఐ సర్వే ఆదేశాలకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించేందుకు ముస్లిం పిటిషనర్లకు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.
టెస్టు క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత్!
టెస్టు క్రికెట్ చరిత్రలో భారత పురుషుల జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డుల్లో నిలిచింది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ సేన ఈ రికార్డు నెలకొల్పింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 12.2 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేరుపై ఉంది. 2001లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక 13.2 ఓవర్లలో 100 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా శ్రీలంక 21 ఏళ్ల పాటు కొనసాగింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ మరో 6 బంతులు ముందుగానే ఈ రికార్డు అందుకుంది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఈ రికార్డు నెలకొల్పారు. రోహిత్ 35 బంతుల్లో అర్ధ సెంచరీ చేయగా.. జైస్వాల్ 30 బంతుల్లో 38 పరుగులు చేశాడు. జైస్వాల్, రోహిత్ కలిసి 98 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ ఔట్ అనంతరం జైస్వాల్, గిల్ కలిసి జట్టు స్కోరుని 100 దాటించారు.
ఎథర్, ఓలాకు పోటీగా.. మార్కెట్‌లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!
భారతదేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు తమ కొత్త మోడల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ మార్కెట్‌ను ఓలా, ఎథర్, టీవీఎస్, సింపుల్ వన్ ఏలుతున్నాయి. తాజాగా వీటికి పోటీనిచ్చేలా సరికొత్త స్కూటర్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఎస్‌ఏఆర్ గ్రూప్ ప్రకటించింది. ‘లెక్ట్రిక్స్’ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు ప్రారంభంలో కంపెనీ ఈ స్కూటర్‌ను లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎస్‌ఏఆర్ గ్రూప్ భారతదేశంలో ఇప్పటికే లుమినస్, లివ్‌గార్డ్, లివ్‌ఫాస్ట్, లివ్ ప్యూర్ వంటి బ్రాండ్స్ నిర్వహిస్తుంది. ప్రధానంగా గృహ అవసరాలతో పాటు పెట్రో వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీలను రూపొందిస్తుంది. దాంతో ఎస్‌ఏఆర్ కంపెనీ కొత్త ఈవీని లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. లెక్ట్రిక్స్ స్కూటర్ బుకింగ్స్ ఆగస్టు నెలలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స్కూటర్ ధర రూ. 1 లక్ష నుంచి లక్షా యాభై వేల మధ్య ఉంటుందని అంచనా. ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఈవీ స్కూటర్‌గా ఉండనుందని తెలుస్తోంది.
ఎల్‌ఐసీ నుంచి ధన్ వృద్ధి పాలసీ.. ప్రయోజనాలు ఇవే..!
ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా ప్రారభించిన ధన్ వృద్ధి పాలసి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.. ఇది పదేళ్ల కాలపరిమితి కలిగిన పథకం..ఈ కొత్త ప్లాన్‌ను ఎల్‌ఐసీ ఇటీవల ప్రారంభించింది. ఇది క్లోజ్ ఎండెడ్ ప్లాన్. మీరు ఈ ప్లాన్‌లో 10 నుంచి 18 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్లాన్‌ను జూన్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొందవచ్చు. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపు ప్లాన్. ఇది జీవిత బీమా సింగిల్-ప్రీమియం పాలసీ. ఇది పాలసీ వ్యవధిలో పొదుపులు, రక్షణ భీమాను అందిస్తుంది.. ఈ పాలసీ రూ. 1000 హామీ మొత్తంపై రూ. 75 వరకు అదనపు హామీని ఇస్తుంది. పాలసీదారు సెక్షన్ 80-సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే, పాలసీని కొనుగోలు చేసిన బీమాదారుడు రూ.1.5 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఎల్‌ఐసీ ధన్ వృద్ధి పాలసీకి కనీస హామీ మొత్తం రూ. 1.25 లక్షలు. దీని తర్వాత 5 వేల రూపాయల వరకు పెంచుకునే వెలసుబాటు ఉంది.. ఇకపోతే ఇది సింగిల్ ప్రీమియం పాలసీ.. డెత్ బెనిఫిట్‌తో పాటు మెచ్యూరిటీ సమయానికి గ్యారంటీతో పాటు మంచి లాభాలను కూడా పొందవచ్చు..
సూపర్ స్టార్ లేకుండానే షూటింగ్?
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం ఘట్టమనేని అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుంటూరు కారం సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పూజా హెగ్డే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకుంది అనే వార్త బయటకి రావడం, థమన్ ఇంకా సాంగ్స్ కంపోజ్ చేయలేదు అనే మాట వినిపించడం… ఇలా రకరకాల రూమర్స్ గుంటూరు కారం సినిమా గురించి వినిపిస్తూనే ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ ఎలాంటి రూమర్ పియా క్లారిటీ ఇవ్వకపోవడంతో గుంటూరు కారం సినిమా విషయంలో ఏం జరుగుతుందో అభిమానులకి కూడా అర్ధం కావట్లేదు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు ఫ్యామిలీ ట్రిప్ వెళ్లాడు. మళ్లీ గుంటూరు కారం సినిమా షూటింగ్ కి మూడు వారాల గ్యాప్ వచ్చిందని అంతా అనుకుంటున్న టైములో త్రివిక్రమ్, మహేష్ లేని సీన్స్ ని ఆగస్టు 2నుంచి షూట్ చేయడానికి రెడీ అయ్యాడు. మిగిలిన ఆర్టిస్టులతో సీన్స్ ని తెరకెక్కిస్తే మహేష్ వచ్చే సరికి కొంతభాగం అయినా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే గుంటూరు కారం సినిమా ఆన్ టైం కంప్లీట్ అవుతుంది. మూడు వారాల తర్వాత మహేష్ ఫారిన్ ట్రిప్ నుంచి తిరిగిరాగానే మహేష్ సీన్స్ ని షూట్ చేయనున్నారు. రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ దాదాపుగా ఇప్పుడు అనౌన్స్ చేసిన డేట్ కి అయితే విడుదలయ్యే అవకాశం కనిపించట్లేదు. సంక్రాంతి నుంచి సమ్మర్ సీజన్ కి గుంటూరు కారం షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.