కేసీఆర్ ఎప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటాడు అని భట్టి విక్రమార్క ఆరోపించాడు. అసెంబ్లీ సమావేశాల అప్పుడు మాత్రమే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే సీఎం కావాలా సంపదను సృష్టించి ప్రజలకు అందించే సీఎం కావాలా.. తేల్చుకోవాలని ఆయన అన్నారు.
రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో పర్యటన ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. నాలుగు నియోజక వర్గాలలో ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లిలో మంత్రుల పర్యాటనలు జరుగనున్నట్లు ఆయన ప్రకటించారు.
దేశంలో ఏటా 22 మిలియన్ టన్నుల నూనెలు అవసరం.. ఇందులో ఎక్కువమొత్తం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహానికి జిల్లాల వారీగా జోన్లను విభజించి కంపెనీలకు అప్పజెప్పామని ఆయన చెప్పారు.
రైతుబంధు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్.. రైతు భీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నది కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. పాలమూరు అంటే నాడు మైగ్రేషన్ నేడు ఇరిగేషన్.. పాలమూరు రంగారెడ్డితో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతాయని ఆయన అన్నారు. భవిష్యత్ లో పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కుమారుడు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఖర్గే పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్రావ్ థాక్రే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను ఇవాళ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. టెట్ ఫలితాల్లో ఓ జీహెచ్ఎంసీ కార్మికుడు సత్తా చాటాడు.
Education: అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ టెట్ ఫలితాలు ఈ రోజు ఉదయం విడుదలైయ్యాయి. ఈ రోజు ఉద్యమ 10 గంటలకి టెట్ కన్వీనర్ రాధారెడ్డి టెట్ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. కాగా ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించిన విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా పేపర్-1కు…
వానాకాలం పంటల పరిస్థితి, రబీ సాగుకు సన్నద్దం, రుణమాఫీ అమలు, ఆయిల్ ఫామ్ సాగుపై సచివాలయంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.