నేడు తెలంగాణ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. నిజామాబాద్ లో బీజేపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా నామకరణం చేశారు. 8021 కోట్ల రూపాయల ప్రాజెక్టులను శంకుస్థాపన చేసి వాటిని ఆయన జాతికి అంకితం చేయనున్నారు.
ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ కేటగిరీల్లోని ఉద్యోగులకు వేతన స్కేళ్లను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండో పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ( అక్టోబర్ 3వ తారీఖు) నిజామాబాద్ కు వస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో నిర్మించిన ఎన్టీపీసీని 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును ఇందూర్ వేదికగా ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు అని తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి మరోసారి సమయం ఆసన్నమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు రెండు దశల్లో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది.
నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. గాంధీ జయంతిని పురస్కారించుకుని స్కిల్ స్కామ్ అక్రమ అరెస్టులో న్యాయం కోరుతూ దీక్ష చేయనున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ‘సత్యమేవ జయతే’ పేరుతో నిరహార దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం…
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభా వేదికగా వాగ్బాణాలను సంధించారు. తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. కరప్షన్, కమీషన్ ఈ రెండు పార్టీల సిద్ధాంతమంటూ విమర్శలు గుప్పించారు.
పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రజలందరకీ నమస్కారములు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధాని మోడీ తెలంగాణ వాసుల మనస్సు దోచుకునే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లుళ్ళ వల్ల మామలకు గిల్లుళ్ళు తప్పవు అంటూ ఎద్దేవా చేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు హరీశ్ రావు అల్లుడు.. ఎన్టీఆర్ కు చంద్రబాబు అల్లుడు.. మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు.. హరీశ్ రావు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు అని ఆరోపించారు.