రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో పర్యటన ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. నాలుగు నియోజక వర్గాలలో ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లిలో మంత్రుల పర్యాటనలు జరుగనున్నట్లు ఆయన ప్రకటించారు. గుబ్బగుర్తిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం చేయనున్నారు. 1350 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయని మంత్రి పువ్వాడ తెలిపారు. ఎన్టీఆర్ పార్క్, అమృత్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి శంకుస్థాపన చేయనున్నట్లు పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: Nara Lokesh: నారా లోకేష్‌కు హైకోర్టులో ఊరట..
త్రీ టౌన్ పరిధిలోని గోళ్లపాడు ఛానల్ మీద ఏర్పాటు చేసిన పది పార్క్ లను మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభిస్తారు అంటూ మంత్రి పువ్వాడ అజయ్ చెప్పారు. మున్నేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును తీగల బ్రిడ్జికి శంకుస్థాపన ఉంటుంది.. అలాగే వీడీఓస్ కాలనీలో వెజ్ అండ్ నాన్ వేజ్ మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రగతి నివేదిన సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మం , కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతిపై డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. భద్రాచలంలో గోదావరి కరకట్టకు 38 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు కూనవరం రోడ్డులో శంకుస్థాపన చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
Read Also: Dengue Fever In Telugu: Dengue Fever: డెంగ్యూ జ్వరం.. తగ్గించే ఇంటి చిట్కాలు..
ఇక, అంబేద్కర్ సెంటర్ లో సెంట్రల్ లైటింగ్.. మీడియా సమావేశం.. మధ్యాహ్నం 2.30 గంటలకు సత్తుపల్లికి చేరుకొని బహిరంగ సభలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనపై ప్రసంగించనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేటిఆర్ గత ఆరు సంవత్సరాలుగా వందల కోట్లు నిధులు తీసుకుని ఖమ్మం వచ్చారు.. అభివృద్ధికి నిధులు ఇచ్చారు.. ప్రజలకు అండదండలు ఇచ్చారు అని ఆయన చెప్పారు. గతంలో అభివృద్ధి సాధ్యమైందా లేదా అనే ఆలోచన చేయాలి.. అసెంబ్లీ వేదికగా ఖమ్మం అభివృద్ధిపై చర్చించారు.. ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు వచ్చి అభివృద్ధిని చూసి వెళ్లారు అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.