నేడు తెలంగాణకు వస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలిపారు. ఇవాళ మహబూబ్ నగర్‌కు వస్తున్నట్లు తెలిపిన ఆయన బీజేపీ ర్యాలీలో ప్రసంగిస్తానని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో 13,500 కోట్ల రూపాయలకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ, రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ రేపు (ఆదివారం) తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా తన పర్యటనకు ముందు కాంగ్రెస్ , బీఆర్ఎస్లపై ఆయన విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు.
తామే నిజమైన దేశభక్తులమని, తెలంగాణ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము చెప్పినట్లే నడవాలంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించాడు. ‘‘ మీరు దేశభక్తులా.... ఏ దేశానికి? పాకిస్తాన్ కా... ఆఫ్ఘనిస్తాన్ కా?’’అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) బృందం అక్టోబర్ 3 నుంచి హైదరాబాద్‌లో పర్యటించనుంది.
మంత్రి కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు అని బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్ అన్నారు. అభివృద్ధి పనుల కోసమే ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్నారు.. రాజకీయాల కోసం కాదు అని ఆయన తెలిపారు.
కరీంనగర్ లో బండి సంజయ్, ఆయన ఎంపీ కార్యాలయం దగ్గర ఎంఐఎం కార్యకర్తల హాల్ చల్ చేశారు. ఎంఐఎం జెండాలతో 50కి పైగా బైక్ లపై కార్యకర్తలు ర్యాలీగా వచ్చి.. బీజేపీకి, బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక, బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఎంఐఎం కార్యకర్తలు అక్కడి నుంచి జారుకున్నారు.