వానాకాలం పంటల పరిస్థితి, రబీ సాగుకు సన్నద్దం, రుణమాఫీ అమలు, ఆయిల్ ఫామ్ సాగుపై సచివాలయంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వానాకాలంలో 65 లక్షల ఎకరాల్లో సాగైన వరి.. ఇప్పటి వరకు ఇది అత్యధికం అని ఆయన తెలిపారు. తెలంగాణ చరిత్రలో ఇది ఒక రికార్డ్.. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలో గతంకన్నా ఈ వానాకాలం 24 వేల ఎకరాల్లో పెరిగిన వరి సాగు.. సిద్దిపేట, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, రంగారెడ్డి జిల్లాలలో గతంకన్నా వరిసాగు పెరిగింది అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
Read Also: RGV: ఒక అమ్మాయిపై పడ్డ ఆర్జీవీ కళ్లు… ఊరు పేరు తెలిస్తే చెప్పండి అంటూ ట్వీట్
మరోవైపు యాసంగి సాగుకు సన్నద్దం చేయాలని అధికారులకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచనలు చేశారు. గత ఏడాది యాసంగిలో 74 లక్షల ఎకరాల్లో సాగు.. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం.. ఈ వానాకాలంలో ఇప్పటి వరకు కోటి 26 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు పండగా.. మరో 12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు.. ఇక, ఆయిల్ ఫామ్ లక్ష 93 వేల ఎకరాలకు చేరింది అని మంత్రి పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు అందుబాటులో ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది.
Read Also: Hardeep Singh Nijjar: ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ.. కారణం ఇదే..
ఈ యాసంగికి రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు ఉంటాయని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. సుమారు 75 నుండి 80 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగవుతాయని ఆయన అంచనా వేశారు. రబీ పంటల సాగుకోసం అన్ని రకాల ఎరువులు కలిపి 18.64 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయింపు.. రబీ సాగు కోసం 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు.. అలాగే 9.2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. గత యాసంగి కన్నా సాగు పెరిగే అవకాశం ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం కోరిన మేరకు 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు.. ఇప్పటి వరకు 21 లక్షల 34 వేల 949 రైతులకు చెందిన రూ.11,812.14 కోట్లు రుణమాఫీ చేశాం..
Read Also: Nara Bhuvaneshwari: సత్యమేవ జయతే.. భువనేశ్వరి నినాదాలు..
అయితే, రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుంది.. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బ్యాంకు ఖాతా మూతపడడం కారణంగా కానీ, సాంకేతిక కారణాలతో కానీ, బ్యాంకుల నుంచి తిరిగి వెళ్లిన రుణమాఫీ నగదు కానీ, లేదా మరే కారణం వలన తిరిగి వెళ్లిన అందరి రైతుల రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీపై సందేహాలున్న రైతులు క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.. రుణమాఫీ సందేహాల నివృత్తి కొరకు రాష్ట్రస్థాయిలో 040 23243667 నంబరులో సంప్రదించగలరు.. ఇప్పటి వరకు పెండింగులో ఉన్న రైతుభీమా క్లెయిములన్నీ వేగంగా పూర్తిచేయాలని అధికారులకు నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.