వనపర్తి జిల్లా సంకిరెడ్డి పల్లి దగ్గర ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజతో పాటు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం బలోపేతం చేసే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పంటల మార్పిడికి శ్రీకారం చుట్టారు.. అందులో భాగంగానే ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు.
Read Also: Atrocious: మనుషులా.. మృగాళ్లా?.. మైనర్‌ను చంపేసి మృతదేహంతో కిరాతక చర్య
దేశంలో ఏటా 22 మిలియన్ టన్నుల నూనెలు అవసరం.. ఇందులో ఎక్కువమొత్తం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహానికి జిల్లాల వారీగా జోన్లను విభజించి కంపెనీలకు అప్పజెప్పామని ఆయన చెప్పారు. 35 ఏళ్లలో 39 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగవుతున్నది.. గత రెండేళ్లలోపే లక్ష 22 వేల ఎకరాల్లో కొత్తగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టాం.. త్వరలోనే రెండు లక్షల ఎకరాలకు చేరుకుంటాం అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Read Also: Rohit Sharma: వరల్డ్ కప్లో టీమిండియాను రోహిత్ శర్మ పక్కా గెలిపిస్తాడు..!
కోతులు, చీడపీడల బెడదలేని పంట ఆయిల్ ఫామ్ అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ సాగు రైతుకు భరోసానిచ్చే క్రమంలో 40 ఎకరాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి ఫ్యాక్టరీ సంకిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేస్తున్నామన్నాడు. ఫ్యాక్టరీకి అవసరమైన మేరకు ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తాం.. వ్యవసాయం బలోపేతం చేసే క్రమంలో కరెంటు, సాగు నీళ్లు, రైతు బంధు, రైతు భీమాతో పాటు వందశాతం కొనుగోళ్లు చేపట్టామని ఆయన చెప్పారు.