ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కుమారుడు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్‌లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఖర్గే పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్‌రావ్ థాక్రే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మైనంపల్లి బీఆర్ఎస్‌ను వీడిన సంగతి తెలిసిందే. మరోవైపు అతని కుటుంబంలో ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేసినట్లుగా ఇప్పటికే రేవంత్ తెలిపాడు.
Read Also: Akkineni Nagarjuna: బిగ్ బాస్ సీజన్ 7.. నాగ్ రెమ్యూనిరేషన్ తో ఒక సినిమా తీయొచ్చు..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మైనంపల్లి తనతో పాటు తన కుమారుడు రోహిత్‌కు మెదక్ నుంచి టికెట్ ఆశించారు. అయితే సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్ధుల జాబితాలో మల్కాజిగిరి నుంచి హనుమంతరావుకు టికెట్ కేటాయించగా.. రోహిత్‌కు మాత్రం నిరాకరించారు. ఈ పరిణామాలతో మైనంపల్లి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి.. కాంగ్రెస్ లో చేరారు. అంతేకాకుండా.. తన కొడుక్కి టికెట్ రాకుండా చేశారంటూ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుందని, మైనంపల్లి ప్లేస్‌లో మల్కాజిగిరిలో మరొకరికి ఛాన్స్ ఇస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ అలాంటివేవి చోటు చేసుకోలేదు. మల్కాజిగిరిలో మైనంపల్లి, మెదక్‌లో రోహిత్ పర్యటిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చివరికి అనుచరులు, కార్యకర్తల సూచన మేరకు మైనంపల్లి బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.
Read Also: ODI World Cup 2023: వరల్డ్ కప్ టీంలోకి రవిచంద్రన్ అశ్విన్.. అక్షర్ పటేల్ స్థానంలో ఛాన్స్