TSPSC Group-I Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు పై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసింది హైకోర్టు డివిజన్ బెంచ్.. ఇదే సమయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది హైకోర్టు.. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు సబబేనని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా అభ్యర్థుల నుండి బయోమెట్రిక్ తీసుకోవాలని పేర్కొంది.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రూల్స్ ను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. అయితే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను 2,33,506 మంది అభ్యర్థులు రాయగా.. పరీక్ష సమయంలో బయో మెట్రిక్ తీసుకొలేదని హై కోర్టును ఆశ్రయించారు ముగ్గురు అభ్యర్థులు.. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. టీఎస్‌పీఎస్సీ పరీక్ష ను సరిగా నిర్వహించలేక పోయిందని వ్యాఖ్యానించింది. కాగా, గ్రూప్-1ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును డివిజన్ బెంచ్‌లో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపై ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ కూడా ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూల్స్ మీరే ఉల్లంఘిస్తే ఎలా అంటూ మండిపడింది. ఒకసారి పేపర్ లీక్, ఇప్పుడేమో బయోమెట్రిక్ సమస్యా? అంటూ ప్రశ్నించింది.