Telangana: క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనది. ఈ వ్యాధి సోకితే ప్రాణత్యాగం చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు దానికి కూడా చికిత్స చేస్తున్నారు. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
తెలంగాణ సీఎం కేసీఆర్ జ్వరం, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వారం రోజులుగా సీఎం కేసీఆర్ కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని ఆయన అన్నారు. కొద్ది రోజుల్లోనే సీఎం ఆరోగ్యం మెరుగయ్యే ఛాన్స్ ఉందని వైద్యులు చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలో లవ్ జిహాదీ ఘటనలు పెరుగుతున్నాయి.. మజ్లీస్ పార్టీ మద్దతుతో ఒక సామాజిక వర్గం హిందూ, క్రిస్టియన్ యువతులను ట్రాప్ చేస్తోంది అని ఆరోపించారు. పేద మహిళలను వలలో వేసుకుని మోసం చేస్తున్నారు.. పథకం ప్రకారం అమ్మాయిలను ట్రాప్ చేసి హత్యలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాప్స్ బంద్ చేస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో వైన్స్ షాపులు బంద్ చేస్తున్నాట్లు ప్రకటించారు.
కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఫిట్ అని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ ఫిట్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.
పార్టీ మారుతారు అనే ప్రచారంపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. నేను పార్టీ మారడం లేదు.. జరుగుతున్నది ప్రచారం మాత్రమే అందులో వాస్తవం లేదు.. ఏఐసీసీలో నాపై చర్చ జరిగినట్టుగా సమాచారం ఉంది.. కాంగ్రెస్ పార్టీ నేతలను నేను కలవ లేదు అని ఆయన తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం'కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.