వనపర్తి జిల్లా సంకిరెడ్డి పల్లి దగ్గర ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రైతుబంధు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్.. రైతు భీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నది కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. పాలమూరు అంటే నాడు మైగ్రేషన్ నేడు ఇరిగేషన్.. పాలమూరు రంగారెడ్డితో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతాయని ఆయన అన్నారు. భవిష్యత్ లో పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Read Also: Ritika Singh: రక్తం మరుగుతోంది.. గుండె మండుతోంది.. రితికా సింగ్ పోస్టు వైరల్
దూరదృష్టితో సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నారు అని ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. సాంప్రదాయ పంటలతో రైతులు వ్యవసాయానికి దూరమయ్యే అవకాశం ఉందని గుర్తించి పంటల మార్పిడితో వ్యవసాయం బలోపేతం చేస్తున్నారు.. ఒకనాడు చెరువు కింద చేను ఉంది అని చెప్పేది.. ఇప్పుడు చేను కిందకు చెరువు వచ్చింది అని తాడూరు మండలం ఐతోలు రైతు, ఎస్వీఎస్ యజమాని కృష్ణారెడ్డి చెప్పారు అని కేటీఆర్ గుర్తు చేశారు. నాడు మనకు అందకుండా కిందకు పోయిన కృష్ణానీళ్లను బొట్టు బొట్టు ఒడిసి పట్టి రైతుల పొలాలకు మళ్లిస్తున్నాం.. వ్యవసాయ మంత్రి నాయకత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధితో పాటు వ్యవసాయం బలోపేతమవుతున్నది అని ఆయన పేర్కొన్నారు.
Read Also: CM YS Jagan: కురుక్షేత్రం జరుగనుంది.. పేదవారంతా ఒక వైపు.. పెత్తందార్లంతా మరోవైపు..!
తెలంగాణ ఏర్పాటుకు ముందు వరి ధాన్యం ఉత్పత్తి కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నులే.. నేడు దాదాపు 3.5 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగడం గమనార్హం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇదే విషయం వరి ధాన్యం కొనమని చెప్పిన కేంద్ర మంత్రికి చెబితే అది ఎలా సాధ్యం అని అపహాస్యం చేశారు.. మేమే ఖర్చు భరిస్తాం ఏం జరిగిందో తెలుసుకోండి అని చెప్పాం.. వరి మాత్రమే సాగు చేయడం భావ్యం కాదు.. దేశంలో అవసరమైన 70 శాతం వంటనూనెలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అని ఆయన తెలిపారు. వరి ఉత్పత్తిలో దేశానికి దారి చూపినట్లే వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు తెలంగాణ దారి చూపాలని కేసీఆర్ ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు.. అయిదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో సాగే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.
Read Also: ICC World Cup 2023: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు బెదిరింపు.. ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూపై కేసు నమోదు..
వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి స్వయంగా అయిల్ పామ్ సాగు చేసి ఆదర్శంగా నిలిచారు అని కేటీఆర్ అన్నారు. సాగులో కష్టనష్టాలు తెలుసుకుని ప్రభుత్వానికి చెప్పేందుకు వారు ముందుగా సాగుచేయడం అభినందనీయం.. 14 కంపెనీలతో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సాహం.. అందుబాటులో ఫ్యాక్టరీలు నిర్మించి రైతులకు ప్రోత్సాహమిస్తాం.. నాలుగేళ్లలో ఆయిల్ ఫామ్ పంట చేతికి వచ్చే వరకు అంతరపంటలు సాగు చేసుకోవచ్చు అని ఆయన చెప్పాడు. ఏడాదికి లక్ష పై చిలుకు ఆదాయం ఆయిల్ ఫామ్ సాగుతో సాధ్యమవుతుంది. వరి సాగు నుంచి రైతులు బయటకు రావాలి.. ఆధునిక వ్యవసాయం వైపు మనందరం కలిసి నడవాలి.. 2601 రైతువేదికలతో వ్యవసాయ విస్తరణ అధికారులను అందుబాటులో ఉంటారు.. కేసీఆర్ నాయకత్వంలో మూడో సారి అధికారంలోకి వస్తామని కేటీఆర్