మిస్టర్ నడ్డా తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫేక్ సర్వేలు పెడుతుంది.. బీజేపీ జాకీ పెట్టిన తెలంగాణలో లేవదు.. కాంగ్రెస్ గెలవదు అని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ దెబ్బకు బిజెపి డక్ ఔట్..కాంగ్రెస్ రన్ ఔట్..కేసీఆర్ సెంచరీ చేయడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాల్లో అభ్యర్థులే లేరు.. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చుడే ఎక్కువ.
బీజేపీ నేత బీఎల్ సంతోష్ అంటున్నాడు.. తెలంగాణ లో హంగ్ వస్తుంది అని.. బీజేపీని నిలవరించడానికి కాంగ్రెస్ కొట్లాడుతుంది అని రేవంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హంగ్ వస్తే బీజేపీతో కలిసేది ఎవరు.. బీఆర్ఎస్ కాదా?.. అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. కాంగ్రెస్ ఆకాశం లాంటిది.. ఆకాశంపై ఉమ్మితే మీపైనే పడుతుంది అంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పేరు దుబాయ్ కేసీఆర్.. దుబాయ్ ఏజెంట్ కొడుకు నా పై మాట్లాడటం విడ్డురంగా ఉందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల డబ్బు తో 4 హెలికాప్టర్ లల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
సైబర్ నేరాలు గుర్తించడం, నేరగాళ్లు విచారణ, దర్యాప్తు చేసి శిక్ష పడేలా చేయడం లా ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ముఖ్య ఉద్దేశ్యం అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబర్ క్రైమ్ సెక్యురిటి కోసమే, డిజిటల్ సెక్యూర్ కోసమే ఈ కౌన్సిల్.. సైబర్ త్రెట్నింగ్స్ పై తెలంగాణ పోలీస్ శాఖ అలెర్ట్ గా ఉంది.. తెలంగాణ రాష్ట్రాన్ని సైబర్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడం లా ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ( CISO) ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సినిమా మా దగ్గర ఉంది.. చంద్రబాబు పని అయిపోగానే కాంగ్రెస్ గూటికి ఆయన వచ్చి చేరారు అంటూ ఓవైసీ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సవాలక్ష సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం అభాసు పాలవుతుంటే.. ఇవేమీ పట్టించుకోకుండా మీరు సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారు.. చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే స్థితికి మీరు దిగజారారు అని ఆయన అన్నారు.
ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుకున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనం కారణంగా ఎండ తీవ్రత ఆకస్మాత్తుగా రెండు నుంచి మూడు డిగ్రీలకు పెరిగిపోయింది. దీనితో భానుడు భగభగ మంటున్నాడు.