Weather alert: ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుకున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనం కారణంగా ఎండ తీవ్రత ఆకస్మాత్తుగా రెండు నుంచి మూడు డిగ్రీలకు పెరిగిపోయింది. దీనితో భానుడు భగభగ మంటున్నాడు. ఈ నేపథ్యంలో వేడి తీవ్రత అధికంగా ఉంది. ఓపక్క పెరిగిన వేడి తీవ్రత.. మరోపక్క ఉక్కపోత దీనితో మిడ్ సమ్మర్ ను తలపిస్తోంది అంటున్నారు ప్రజలు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పరిస్థితి తీవ్రంగా ఉంటోంది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగించక పోతే ఇళ్లు, కార్యాలయాల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. కాలం కాని కాలంలో ఎండ తీవ్రత తార స్థాయికి చేరుకోవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెరిగిన ఉష్టోగ్రతల కారణంగా ప్రజలు ఇళ్ల నుండి బయటకి రావాలనంటేనే భయపడుతున్నారు. అక్టోబర్,నవంబర్ ఈ రెండు నెలల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమనంలో ఉన్నాయి. దీని కారణంగా మేఘాలు ఏర్పడడం లేదు. దీనికి తోడు తీర ప్రాంతం కావడం చేత గాలిలో తేమ శాతం పెరుగుతుంది. దీని కారణంగా ఉక్కపోతగా ఉంటుంది. అక్టోబరు 15 నాటికి రుతుపవనాల నిష్క్రమణ పూర్తవుతుంది.
Read also:Viral news: బుడ్డోడి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. తల్లిని గుద్దిన కారుకు ఎదురెళ్లి తిరగబడ్డాడు
దీనిని బట్టి చూస్తే నవంబరు మొదటి వారం వరకు వేడి, ఉక్కపోతను భరించక తప్పదు. ఒక్కసారిగా వచ్చిన వాతావరణ మార్పుల కారణంగా విశాఖ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీరం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితేనే వానలకు అవకాశముంది. లేకపోతే లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాలంలో వర్షాలు దాదాపుగా ముగిసినట్లే అని భిప్రాయపడుతున్నారు నిపుణులు.