అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. “తమిళనాడు ఎన్‌డీఏతోనే ఉంది” అంటూ ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. అవినీతితో నిండిన డీఎంకే ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే వీడ్కోలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. చెన్నై సమీపంలోని మధురాంతకంలో జరగబోయే ర్యాలీకి ముందు ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని వ్యాఖ్యలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. మోడీ చెప్పినట్టుగా తమిళనాడు ఎన్‌డీఏతో లేదని.. బదులుగా “ఎన్‌డీఏ చేసిన ద్రోహాలను తమిళనాడు లెక్కపెడుతోంది” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: US-Canada: అమెరికా-కెనడా మధ్య ఉద్రిక్తతలు.. బోర్డ్ ఆఫ్ పీస్ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్
తాజాగా ఉపాధి హామీ పథకం పేరును జీ రామ్ జీ కింద మార్చడాన్ని స్టాలిన్ సర్కార్ తప్పుపట్టింది. జీ రామ్ జీ కింద కొత్త నిధుల విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడులో మోడీ పర్యటనకు కొన్ని గంటల ముందే తీర్మానం ఆమోదం పొందడం విశేషం.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పేరు మార్చడం.. నిధుల నిర్మాణాన్ని మార్చాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ స్టాలిన్ సర్కార్ శుక్రవారం తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. గ్రామీణ ఉద్యోగాల కార్యక్రమానికి మహాత్మా గాంధీ పేరునే ఉంచాలని డిమాండ్ చేశారు. గ్రామీణ పౌరుల ‘పని హక్కు’ను రక్షించాలని.. మహిళలు, వికలాంగులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు ఈ పథకం కింద ప్రాథమిక లబ్ధిదారులుగా ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది.
అసెంబ్లీ తీర్మానం ఆమోదం కాగానే తమిళనాడు బీజేపీ నేత అన్నామలై.. డీఎంకే ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర-రాష్ట్ర సమస్యలను రాజకీయం చేస్తున్నారని.. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో స్టాలిన్ సర్కార్ విఫలమైందని అన్నామలై ఆరోపించారు.
మోడీకి స్టాలిన్ కౌంటర్..
తమిళనాడు ఎన్‌డీఏతోనే ఉంది” అంటూ ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. అవినీతితో నిండిన డీఎంకే ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే వీడ్కోలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. చెన్నై సమీపంలోని మధురాంతకంలో జరగబోయే ర్యాలీకి ముందు ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి స్టాలిన్ కౌంటర్ ఎటాక్ చేశారు.
తమిళ భాష అభివృద్ధికి సంబంధించిన నిధుల పరిస్థితి ఏంటో చెప్పాలని, ఎంజీఎన్‌రేగా వంటి ఉపాధి పథకాల భవిష్యత్తు ఏమవుతుందో స్పష్టం చేయాలని స్టాలిన్ కోరారు. ఎన్నేళ్లుగా ఆలస్యం అవుతున్న మదురై ఎయిమ్స్ ప్రాజెక్టును ఎద్దేవా చేస్తూ.. దాన్ని “ప్రపంచంలోని ఎనిమిదో అద్భుతం”లా మార్చేశారని విమర్శించారు. అంతేకాదు, ప్రకృతి విపత్తుల సహాయ నిధుల ఆలస్యం, హోసూర్ విమానాశ్రయం, కోయంబత్తూరు, మదురై మెట్రో రైలు ప్రాజెక్టులకు ఆమోదం లేకపోవడం వంటి అంశాల్ని కూడా లేవనెత్తారు. వైద్య ప్రవేశ పరీక్ష నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్‌ను మరోసారి గుర్తు చేశారు. “బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ తమిళనాడును మోసం చేస్తూనే ఉంటే, ప్రజలు కూడా ఆ కూటమిని ఓడిస్తూనే ఉంటారు” అని స్టాలిన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. తన పోస్ట్‌కు #NDABetraysTN అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు.