క్రైస్తవ హక్కుల సమావేశం హరిహర కళాభావన్ లో జరిగింది ఈ సమావేశానికి మాజీ కేంద్రమంత్రి చిదంబరం, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మైనార్టీలు భయం భయంగా బతకాల్సి వస్తుంది అని అన్నారు. మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనల్ని భయపెడుతుంది.. దేశ ప్రజల ఆత్మరక్షణ కోసం రాహుల్ గాంధీ దేశం అంతా పాదయాత్ర చేశారు అని ఆయన పేర్కొన్నారు.
Read Also: ODI World Cup 2023: ఐడెన్ మార్క్రామ్ రికార్డు.. ప్రపంచకప్లో అత్యంత వేగంగా సెంచరీ
మైనార్టీలు ఎవరు భయపడాల్సిన పనిలేదు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధైర్యం చెప్పారు. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో క్రిస్టియన్ ల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్ అంటున్నాడు.. తెలంగాణ లో హంగ్ వస్తుంది అని.. బీజేపీని నిలవరించడానికి కాంగ్రెస్ కొట్లాడుతుంది అని రేవంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హంగ్ వస్తే బీజేపీతో కలిసేది ఎవరు.. బీఆర్ఎస్ కాదా?.. అని ఆయన ప్రశ్నించారు.
Read Also: P. Chidambaram: మోడీ ప్రభుత్వంలో మైనార్టీలు భయంతో బతుకుతున్నారు..
కాంగ్రెస్ ఓట్లు చీల్చి హంగ్ ఏర్పాటుకు బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హంగ్ లో బీజేపీ.. బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తుంది అని ఆయన అన్నారు. ఈ కుట్ర భగ్నం చేయండి.. కర్ణాటకలో మాదిరిగా.. మైనార్టీలు.. క్రిస్టియన్ లు.. కాంగ్రెస్ కి అండగా ఉండండి అని రేవంత్ రెడ్డి కోరారు. కర్ణాటకలో జేడీఎస్ లాగా బీజేపీ ఇక్కడ చేయాలని చూస్తుంది అని ఆయన అన్నారు.
Read Also: Nagababu: అబ్బాయిల వల్లే బ్రేకప్ లు, కంట్రోల్ చేయాలనుకునే ఇలా.. నాగబాబు కీలక వ్యాఖ్యలు!
నన్ను కేసీఆర్ కొడంగల్ లో పడగొడితే.. మల్కాజిగిరిలో మీరు నన్ను నిలబెట్టారు అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ బలం ఇచ్చింది మీరే.. మైనార్టీలు అంతా అండగా ఉండండి కాంగ్రెస్ కి.. బీజేపీ.. కేసీఆర్.. ఇద్దరు కాంగ్రెస్ నే దూషిస్తున్నారు.. బీజేపీ-బీఆర్ఎప్ ది ఫెవికాల్ బంధం.. ఎంఐఎం కూడా ఎందుకు తిడుతుంది.. పదవులు త్యాగం చేసినందుకా.. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ కి దళితుడు అధ్యక్షుడు కాగలడా?.. అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొప్పుల ఈశ్వర్ పక్కన కూర్చుంటేనే కేసీఆర్ సహించలేదు.. దళితుడు ఒక్కడు మంత్రి లేడు.. కానీ, కాంగ్రెస్ అద్యక్షుడు ఖర్గే అయ్యాడని రేవంత్ అన్నారు.
Read Also: LEO : లియో ‘బాడాస్’ సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది…
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మోడీ పతనం స్టార్ట్ అయినట్లే అని రేవంత్ రెడ్డి అన్నారు హంగ్ వస్తోంది అని బీఎస్ సంతోష్ సంతోష పడుతున్నాడు.. తెలంగాణ రాష్ట్రాన్ని మరో మణిపూర్ ని చేయాలని బీజేపీ చూస్తుంది.. బీఆర్ఎస్ కి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అని ఆయన ప్రకటించారు. కేసీఆర్ ని గెలిపిస్తే.. మోడీని గెలిపించినట్టే.. అసద్.. సోనియాగాంధీ గురించి మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అంటూ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.