కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే దమ్ముందా..? అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఆయనను సీఎం అభ్యర్ధిగా ప్రకటించిన మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది అని ఆయన వ్యాఖ్యనించారు.
సారూ.. కారు... పదహారు అన్నారు ఏమయింది?.. ఢిల్లీలో చక్రం తిప్పుతా అన్నారు.. బొంగురం కూడా తిప్పలేదు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్. లక్ష్మణ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండు సభలు జస్ట్ ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది అని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 15 రోజులుగా చీకట్లోకి వెళ్ళిపోయారు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలన చూస్తే తెలంగాణ ఎందుకు వచ్చిందని బాధగా అనిపిస్తుంది.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంగంట్లో అమ్మకానికి పెట్టిన సరకుగా మారింది.. రాష్ట్రంలో భార్యాభర్తలు కలిసి సంసారం చేయలేకపోతున్నారు.
Jagtial Young Man Venkat Sai Was Cheated by Cyber Criminals: సైబర్ కేటుగాళ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నిత్యం ఓ అడుగు అడ్వాన్స్‌గా ఉంటూ.. అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా అమాయకులకు ఎరవేసి.. వారి కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. సైబర్ నేరగాళ్ల తెలివికి.. అమాయకులు మాత్రమే కాదు సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ కూడా మోసపోతున్నారు. తాజాగా మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. టాస్క్ పేరిట ఓ యువకుడికి ఏకంగా రూ. 3.17 లక్షలు టోకరా పెట్టారు.…