Dussehra Holidays: దసరా పండుగ వస్తుందంటే చాలు.. ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి.. స్కూళ్లకు ఎన్ని రోజులు, కాలేజీలకు ఎన్ని రోజులు.. పిల్లలకు సెలవులు రావడంతో.. ఆఫీసులో లీవ్‌లు ఎలా ప్లాన్ చేసుకోవాలని అంతా ఆలోచిస్తూ ఉంటారు.. కొందరు ముందుగానే ఫ్యామిలీని మొత్తం ఊరికి పంపించి.. సెలవులను బట్టి.. వారు తర్వాత ప్లాన్ చేసుకుంటారు.. అయితే, సెలవుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది.. గతంలో ప్రకటించిన సెలవుల్లో మార్పులు చేస్తూ తాజాగా ప్రకటన చేసింది..
Read Also: Artiste : ఇంట్రెస్టింగ్ గా ‘ఆర్టిస్ట్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్
తెలంగాణ ప్రభుత్వ తాజా ప్రకటన ప్రకారం.. ఈ నెల 23, 24 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయి.. అయితే, ఇంతకు ముందు 24, 25 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే.. కానీ, ఇప్పుడు వాటిలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్.. మరోవైపు.. బతుకమ్మ, దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని.. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు డిసైడ్ చేశారు.. ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు సెలవులు ప్రకటించగా.. జూనియర్ కాలేజీలకు ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే. ఇక, ఆయా స్కూళ్లు సెలవులకు ముందే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాయి.. ఎగ్జామ్స్ పూర్తి చేసి ఊరిబాట పట్టేందుకు విద్యార్థులు సిద్ధం అవుతున్నారు.