Asaduddin Owaisi: రేవంత్ రెడ్డి సినిమా మొత్తం మా దగ్గరుందంటూ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సినిమా మా దగ్గర ఉంది.. చంద్రబాబు పని అయిపోగానే కాంగ్రెస్ గూటికి ఆయన వచ్చి చేరారు అంటూ ఓవైసీ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి జీవితమంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్ తోనే ముడిపడి ఉందని అసదుద్దీన్ కామెంట్స్ చేశారు. దశాబ్థాల పాటు రేవంత్ రెడ్డి.. కిషన్ రెడ్డితోనే కలిసి తిరిగారని ఆయన ఆరోపించారు. ఒవైసీ కుటుంబం మహారాష్ట్ర నుంచి వచ్చిందని రేవంత్ రెడ్డి అంటున్నారు.. కానీ, తన తాత ముత్తాతలు హిందుస్తాన్‌లోనే పుట్టారని ఆయన క్లారిటీ ఇచ్చారు. నా పూర్వీకులు ఇక్కడ పుడితే నా దేశం ఇదే అనే హక్కు తనకు లేదా అని అసదుద్దీన్ ఒవైసీ అడిగారు.
Read Also: Revanth Reddy: సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Also Read
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
- Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
- POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
- Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
రాహుల్ గాంధీ అసలు ఎక్కడి నుంచి వచ్చారని అసదుద్దీన్ ఓవైసీ నిలదీశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న మాటలు ఆర్ఎస్ఎస్ నాలుక నుంచి వచ్చినవని అంటూ ఆయన దుయ్య బట్టారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి పనిచేయడాన్ని తాను చూశానని అసదుద్దీన్ ఆరోపించారు. ఆయన ముందు ఏబీవీపీలో అటు నుంచి ఆర్ఎస్ఎస్ అక్కడి నుంచి బీజేపీలోకి వెళ్లినట్టు ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ వాళ్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి దగ్గరకు వెళ్లమంటే అక్కడికి వెళ్లినట్టు తెలిపారు.. ఆయన పని అయిపోగానే కాంగ్రెస్‌లోకి వెళ్లాడని ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేదని చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తావా అని ఒవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎక్కడ పుట్టారో రేవంత్ చెప్పాలని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!