మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తి దాడి దుదృష్టకరం, బాధాకరం అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.. ప్రజాస్వామ్య లో దాడులు పరిష్కారం కావు.. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. హామీలు ఇవ్వడం, మభ్యపెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.. నితీ, నిజాయితీ బీఆర్ఎస్ ఎజెండాలో లేదు.. యువత నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పటం ఖాయం.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
కొత్త ప్రభాకర్ రెడ్డికి గజ్వేల్ లో ప్రాథమిక చికిత్స అందించాం.. రక్త స్రావం ఎక్కువ అవుతోంది.. హైదరాబాద్ తీసుకెళ్ళమని డాక్టర్లు చెప్పారు అని చెబుతూ మంత్రి హరీశ్ రావు భావోద్వేగానికి లోనైయ్యారు. అన్నారు. భౌతిక దాడులకు, హత్యా యత్నాలకు దిగడం సరైంది కాదు.. దాడి చేసిన వ్యక్తి ఎవరు... ఎందుకు చేశాడు అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును ఎదుర్కోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు.
Ugravai village: సాధారణంగా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి అందరూ కలిసి ఓ సంఘాన్ని ఏర్పరచుకుంటారు. ఆలా ఏర్పడిన సంఘాలు చాలానే ఉన్నాయి. మహిళా సంఘం, విద్యార్థి సంఘం, కార్మిక సంఘం ఇలా అనేక సంఘాలు ఉన్నాయి. కానీ జీవితాంతం పిల్లల కోసం అహర్నిశలు శ్రమిచ్చి.. వాళ్ళకి ఓ మంచి జీవితాన్ని అందించి చివరికి కదల లేని వృధాప్య స్థితిలో పిల్లలు చేరదీయ్యని తల్లిదండ్రుల తరుపున న్యాయం కోసం పోరాడే సంఘాలు చరిత్రలో…
Women Died with Heart Attack while boarding the Plane in Chandigarh: నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్ననారాయణపురం సర్పంచి కె నర్సింహా భార్య ఇందిరాబాయి (48) ఛండీగఢ్లో మరణించారు. డ్వాక్రా ఉద్యోగిని అయిన ఇందిరాబాయి ఛండీగఢ్లో విమానం ఎక్కే క్రమంలో గుండెపోటు రావడంతో శుక్రవారం మృతి చెందారు. ఇందిరాబాయి మృతదేహాన్ని చిన్ననారాయణపురానికి తరలించడానికి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాత్రి మృతదేహం ఆమె స్వగ్రామానికి చేరుకోగా.. సోమవారం అంత్యక్రియలు…
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందని స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. కల్లబొల్లి మాటలతో , మోసపూరిత హామీలతో తెలంగాణ రైతులను ఆగం చేస్తుంది కాంగ్రెస్ అంటూ ఆయన చెప్పారు.