మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో ఆయనకు సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, యశోద ఆస్పత్రిలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని మంత్రి హరీశ్ రావు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాకర్ రెడ్డికి బలమైన గాయం అయిందని డాక్టర్లు చెప్పారు.. స్కాన్ చేసిన తర్వాత.. ఆపరేషన్ అవసరమని చెప్పారు.. ప్రస్తుతం సర్జరీ జరుగుతోంది అని మంత్రి తెలిపారు.
Read also: Akkineni Naga Chaitanya: లుక్ అదిరింది.. హిట్ కూడా ఇస్తే బావుంటుంది
కొత్త ప్రభాకర్ రెడ్డికి గజ్వేల్ లో ప్రాథమిక చికిత్స అందించాం.. రక్త స్రావం ఎక్కువ అవుతోంది.. హైదరాబాద్ తీసుకెళ్ళమని డాక్టర్లు చెప్పారు అని చెబుతూ మంత్రి హరీశ్ రావు భావోద్వేగానికి లోనైయ్యారు. అన్నారు. భౌతిక దాడులకు, హత్యా యత్నాలకు దిగడం సరైంది కాదు.. దాడి చేసిన వ్యక్తి ఎవరు… ఎందుకు చేశాడు అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. కాసేపట్లో సీఎం కెసిఆర్ ఆస్పత్రికి వస్తారు అని ఆయన తెలిపారు. కత్తితో దాడి చేస్తున్న క్రమంలో అడ్డుకోబోయిన ఎంపీ గన్ మెన్ చేతికి కూడా గాయం అయిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇలాంటి దాడులు చేయడం పద్దతి కాదన్నారు. ఇక, సికింద్రాబాద్ లోని ఆస్పత్రికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. బీజేపీకి, ఎమ్మెల్యే రఘునందన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బీజేపీ అంతు చూస్తాం అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆస్పత్రి దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూస్తున్నారు.