Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హాట్ హాట్ గా మారాయి. ఇన్ని రోజులు ఇలాగే ఉంటే.. నిన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (కొత్త ప్రభాకర్ రెడ్డి ఎటాక్)పై కత్తి దాడి మరో స్థాయికి చేరుకుంది.
ఎంపీపై దాడి ఏ పరిస్థితిలో చేశాడో వాస్తవాలు విచారణలో బయటకు వస్తాయి.. నా కార్యకర్తలకు ఒక్కటే చెప్తాను ఎవరైనా ఏదైనా అంటే ఓపిక పట్టండని అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు.
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నాము అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. డాక్టర్లు వారి ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నరు.. ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడింది.. ఇన్ఫెక్షన్ తగ్గడం కోసం ఐసీయూలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది.. ఇంత ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. కోడికత్తి అని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుబ్బాక ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్సలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు.
Jalagam Venkatarao: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారు.
TS Congress: రెండో విడత ఎన్నికల ప్రచారానికి ప్రియాంక గాంధీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్, దేవరకద్రలో జరిగే బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు.