Kishan Reddy: హామీలు ఇవ్వడం, మభ్యపెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నివురుగప్పిన నిప్పులా యువత అసంతృప్తితో రగిలిపోతున్నారు అని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి, కిషన్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ పగటి కలలు కంటున్నారు.. డిసెంబర్ 3వ తేదీ తర్వాత అధికారంలోకి వచ్చినట్లు ఊహాలోకంలో విహరిస్తున్నారు.. సీఎం కేసీఆర్ రెండు స్థానాల్లో ఓడిపోవడం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆరాటం ఉంటే TSPSCని ఎందుకు ప్రక్షాళన చేయలేదు? అని ప్రశ్నించారు. ప్రజల ఓట్లు అడిగే ముందు తగిన సంజాయిషీ ఇవ్వాలి.. ఉద్యోగ నియామకాలు జరపకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కాలయపన చేసింది అని కిషన్ రెడ్డి ఆరోపించారు.
Read also: Katrina Kaif: ప్రపంచంలోనే బెస్ట్ యాక్షన్ టీమ్ తో కలిసి పని చేశాను
Also Read
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
బీఆర్ఎస్ అభ్యర్థులు జనాల్లో జవాబు చెప్పలేక వెనుతిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. TSPSC ని ప్రక్షాళన చేస్తామని ఇప్పుడు కేటీఆర్ చెబుతున్నారు.. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయి.. ఆస్తులు అమ్మి హైదరాబాద్ వచ్చిన TSPSC అభ్యర్థుల పరిస్థితి.. ఆవేదన, తపన సీఎం కుటుంబానికి తెలియదు అంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని నగరం నడిబొడ్డున ప్రవళిక ఆత్మహత్యను కప్పిపుచ్చుకున్నా.. పాపం మాత్రం కేసీఆర్ ప్రభుత్వానిదేనంటూ బీజేపీ చీఫ్ ధ్వజమెత్తాడు. మెట్ పల్లికి చెందిన రెహామత్ గ్రూప్స్ పరీక్ష వాయిదా పడితే ఆత్మహత్య చేసుకున్న ఘటనను కూడా తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు.. TSPSC నియామక పరీక్షలను అనేక సార్లు రద్దు చేసిన రికార్డ్ బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Priyanka Gandhi: సబ్సిడీ సిలిండర్లు, రుణమాఫీ, ఉచిత కరెంట్.. ఛత్తీస్‌గఢ్‌లో ప్రియాంక హామీ
కొలువుల కోసం కొట్లడితే నిరుద్యోగులకు నిరాశే మిగిలింది అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అత్యధికంగా నిరుద్యోగులు 16 శాతం ఉన్నారు.. ఒక్క గ్రూప్-1 పోస్ట్ కూడా కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదు.. ఒక్క టీచర్ పోస్ట్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీలప్ చేయలేదు.. నిరుద్యోగుల ఆశలపై బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు చల్లింది.. యూనివర్సిటీల్లో చాలా విభాగాలు మూత పడ్డాయి.. విశ్వవిద్యాలయాల పరిస్థితి దయనీయంగా మారింది అని ఆయన ఆరోపించారు. విద్యార్థులు విశ్వవిద్యాలయాల పట్ల విశ్వాసం కోల్పోయారు.. రైతులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారు.. మోసం చేయడం కేసీఆర్ ప్రభుత్వ నైజం అని కిషన్ రెడ్డి తెలిపారు.
Read also: World Cup 2023: ఫైనల్లో తలపడే జట్లు ఇవే.. జోస్యం చెప్పిన ఆస్ట్రేలియా క్రికెటర్
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. హామీలు ఇవ్వడం, మభ్యపెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.. నితీ, నిజాయితీ బీఆర్ఎస్ ఎజెండాలో లేదు.. యువత నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పటం ఖాయం.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ప్రతినెలా చివరివారంలో ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నామో.. అదే తరహాలో ఉద్యోగ ఖాళీలు రాష్ట్రంలో భర్తీ చేస్తాం.. ఉపాధి పరంగా అన్ని రకాల వృత్తులను ప్రోత్సహిస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు.
- Tags
- BRS
- cm kcr
- Kishan Reddy
- telangana
- tspsc
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?