Telangana CM Post: సీఎం ఎవరనేదానిపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులు నేడు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీలో చర్చించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించినా.. ముఖ్యమంత్రి ఎంపిక అంశం కొలిక్కి రాలేదు. సోమవారం భేటీలు, సమావేశాలు, చర్చలు, ఇంకాసేపట్లోనే ప్రమాణ స్వీకారమనే ప్రచారాల మధ్య ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు మల్లికార్జున ఖర్గేతో థాక్రే, డీకేఎస్ భేటీ కానున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎంలు, మంత్రివర్గ ఏర్పాటుపై చర్చ జరగనుంది. నేడు కాంగ్రెస్ అధిష్టానం కార్యాచరణ ఖరారు చేయనుంది. ఎస్సై నియామకాల సవాల్ రిట్ పిటిషన్పై…
తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాల్లో పార్టీ గెలిచిన వెంటనే జరగాల్సిన సీఎం ఎంపిక వాయిదా పడింది. ముఖ్యమంత్రి పదవి ఎవరికివ్వాలనే గొడవ ఈజీగా తేలేలా కనిపించడం లేదు..
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 9వ తారీఖు నుంచి రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నది.
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి కోసం కాన్యాయ్ ని సాధారణ పరిపాలన శాఖ సిద్ధం చేసింది. ప్రాథమికంగా వైట్ కలర్ కాన్యాయ్ ను అధికారులు రెడీ చేశారు. దిల్ కుషా గెస్ట్ హౌస్ కి 6 ఇన్నోవా కార్లు వచ్చి చేరుకున్నాయి. రెండు కొత్త కార్లు ఉండగా మిగతా 4 కార్లు ఇప్పటికే నెంబర్ ప్లేట్ అలాట్ అయినవి ఉన్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు గెజిట్ విడుదల చేస్తుంది. అయితే, కొత్త అసెంబ్లీ శాసనసభను ఏర్పాటు చేస్తూ కూడా జీవోను జారీ చేసింది.