గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియమితులైన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర హై కోర్టు మరో కీలక తీర్పు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇవాళ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. దాసోజీ శ్రావణ్, సత్యనారాయణ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేసింది.
వికారాబాద్ జిల్లా దామగండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ ఏర్పాటు వల్ల అడవులు, గాలి, భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని కొందరు ఆరోపణలు చేస్తున్నారు.. దీనిపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే నేవీ రాడార్ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు.
నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించబోతున్నారు. ఉదయం 10.30 గంటలకు ముస్తాబాద్ జడ్పిటిసి కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యక్రమానికి హాజరుకానున్నారు.
సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి దామోదర రాజ నర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం అధికారులను ఆదేశించారు.
Nagoba Jatara: గిరిజన బిడ్డల సంబరాలు అంబరాన్ని తాకే నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరుగుతున్న నాగదేవత నాగోబా జాతర కన్నుల పండువగా కొనసాగుతోంది.