ఇప్పటి వరకు రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోని వారికి గుడ్న్యూస్ చెబుతూ.. మరో అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుండగా.. ముందుగా విధించిన గడువు ప్రకారం జనవరి 31వ తేదీతో అంటే.. ఈ నెల 31 తేదీతో ముగియనుంది. ఫిబ్రవరి చివరి వరకు అంటే.. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఈ-కేవైసీ చేసుకొచ్చు అని తెలంగాణ పౌరసరఫరాల శాఖ పేర్కొంది.
తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వీసీ(వైస్ ఛాన్సలర్లు) నియామకానికి ప్రక్రియ ప్రారంభించింది. వీసీ పోస్టుల దరఖాస్తు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అర్హులైన వారు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. కాగా.. వీసీల పదవి కాలం మే లో ముగియనుంది. ఆ లోపే ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకోసం త్వరలో సెర్చ్ కమిటీలు వేయనుంది.
శనివారం సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఎన్నికల్లో…