Tunnel Roads: హైదరాబాద్ నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైతే రాత్రి 10 గంటల వరకు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు దర్శనమిస్తున్నాయి. ఎవరిని అడిగినా ట్రాఫిక్ సమస్యల గురించి కథలు చెబుతారు. వర్షాకాలంలో ట్రాఫిక్ నరకం ఎక్కువ. ఎక్కడ చూసినా నీరు నిలిచి చిన్న చిన్న చెరువులను తలపిస్తోంది. నగరంలో వాహనదారుల ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ట్రాఫిక్ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు సమీక్షలు నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read also: State Bank of India : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ను అధిగమించిన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్
హైదరాబాద్‌లో ఇటీవల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. ఒక్కసారి రోడ్డుపైకి వస్తే వాహనదారులు పడే ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పరిష్కారం తెలుసుకునేందుకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసు శాఖ అధికారులు నగరంలో పర్యటించి రద్దీగా ఉండే పలు ప్రాంతాలను పరిశీలించారు. ఇందులో భాగంగా టన్నెల్ రోడ్ల నిర్మాణంపై అధికారులు దృష్టి సారించి అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కొత్తగా 5టన్నుల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమైన సంగతి తెలిసిందే. కోహినూర్ కేంద్రంగా మూడు రూట్లలో 39 కిలోమీటర్ల టన్నెల్ టన్నెల్ రోడ్ల నిర్మాణానికి నివేదిక సిద్ధం చేయాలని ఐటీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఆసక్తి ఉన్న వారికి టెండర్లు పిలిచారు. గత పదేళ్ల నుంచి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మిస్తున్నారు. అయినా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో పంచుకోండి.
Read also: ED Summons: కేజ్రీవాల్ కు ఏడోసారి ఈడీ నోటీసులు..
అధికారులు ప్రతిపాదించిన 5 మార్గాలు ఇవే..
* ITC కోహినూర్ నుండి ఖాజా గూడ, నానక్ రామ్ గూడ మీదుగా విప్రో సర్కిల్ – 9 కి.మీ.
* ITC కోహినూర్ నుండి బంజారాహిల్స్ రోడ్ నెం. 10 నుండి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 – 7 కి.మీల మీదుగా
* మైండ్ స్పేస్ జంక్షన్ ద్వారా ITC కోహినూర్ నుండి JNTU వరకు – 8 కి.మీ
* నాంపల్లి నుండి చాంద్రాయణ గుట్ట ఇన్నర్ రింగ్ రోడ్ గుట్ట మీదుగా చార్మినార్, ఫలక్ నుమా- 9 కి.మీ.
* జీవీకే మాల్ నుండి మాసబ్ ట్యాంక్ మీదుగా నానల్ నగర్ – 6 కి.మీ
WhatsApp : వాట్సాప్ లో మరో ప్రైవసీ ఫీచర్.. అలాంటివి ఇకమీదట కుదరదు!