నేడు ఒంగోలులో సీఎం జగన్ పర్యటన.. ఒంగోలు నగర పరిధిలోని 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్..
నేడు మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. శ్రీ సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్న సీఎం.. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో మేడారం బయలుదేరనున్న సీఎం రేవంత్ రెడ్డి.
నేడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించనున్న డిప్యూటీ సీఎం భట్టి.. పురోగతి పనులను పరిశీలించిన తర్వాత అధికారులతో భట్టి సమీక్ష..
నేడు పొత్తుల పై కాంగ్రెస్, వామపక్ష పార్టీ నేతల భేటీ.. 9 గంటలకు ఏపీసీసీ కార్యాలయానికి రానున్న సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, శ్రీనివాసరావు.. వైఎస్ షర్మిలతో భేటీ కానున్న వామపక్ష పార్టీల నేతలు.. ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్న సీపీఐ, సీపీఎం పార్టీలు.. పోటీ చేసే సీట్లపై, మేనిఫెస్టోపై చర్చించే అవకాశం..
నేడు కొమురంభీం జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. ఉ.9గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ లో ప్రెస్ మీట్.. ఉ. 11 గంటలకు రోడ్ షోలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.. అనంతరం మంచిర్యాల జిల్లా తాండూరు, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాలలో రోడ్ షోలో పాల్గొననున్న కిషన్ రెడ్డి..
నేడు సంగారెడ్డి జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర.. పటాన్ చెరు నియోజకవర్గంలో కొనసాగనున్న యాత్ర.. పాల్గొననున్న కేంద్రమంత్రి అశ్విని కుమార్, ఈటల రాజేందర్..
నేడు ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ చర్చలు.. 13 ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం.. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఏపీజేఏసీ.. ఈ నెల 27న బీఆర్టీఎస్ రోడ్డులో ఉద్యమం నిర్వహించడానికి ఏపీజేఏసీ నిర్ణయం..
నేడు తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ పర్యటన.. ఉదయం: 8:00 గంటలకు స్వచ్ఛత-మన బాధ్యత శానిటేషన్ పై స్పేషల్ డ్రైవ్ & పలు అభివృద్ధి కార్యక్రమాలలో హజరు.. సాయంత్రం 3:30 గంటలకు వాలంటీర్లకు వందనం కార్యక్రమం కోంతమూరు పంచాయతీ కార్యలయం దగ్గర పాల్గొంటారు.
నేడు పశ్చిమ గోదావరిలో పర్యటించనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ.. తాడేపల్లిగూడెం మండలంలోని వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నేడు చిత్తూరు, సత్యవేడులో నారా భువనేశ్వరి పర్యటన.. కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, రూ. 3 లక్షలు ఆర్థిక సాయం అందించనున్న భువనేశ్వరి..
నేడు అంబెడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం లో మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పర్యటన.. కాపు కళ్యాణ మండపంలో కొత్తపేట నియోజకవర్గ స్థాయి మదిగల సమావేశంలో పాల్గొననున్న కృష్ణమాదిగ.
నేడు తిరుమలలో టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ.. నేటి ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో మే నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టిక్కెట్లు, ఉ.11 గంటలకు శ్రీవాణి టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల..
నేటి నుంచి భారత్- ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్.. రాంచీ వేదికగా ఉదయం 9.30 గంటలకి మ్యాచ్ ప్రారంభం.. 5 మ్యాచ్ ల సిరిస్ లో ఇప్పటికే 2-1తో భారత్ ఆధిక్యం..