Sammakka Sarakka Jatara: మేడారంలో కీలక ఘట్టం ఆవిష్కృతం.. గద్దెపైకి సమ్మక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టనుంచి కుంకుమ భరణి రూపంలో బయల్దేరి వచ్చిన సమ్మక్క.. గద్దెకు చేరుకుంది. సమ్మక్కను ప్రధాన పూజారి ప్రతిష్టించారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించే సమయంలో లైట్లు నిలిపివేశారు. మరోవైపు.. అమ్మవారిని గద్దెపై ప్రతిష్టించే సమయంలో భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించడంతో భారీ ఎత్తున భక్తులు జై సమ్మక్క తల్లి-జై సారక్క తల్లి అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే.. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు చేరుకుంది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలకు చేరుకుని.. భక్త జనులకు దర్శనమిస్తున్నారు. రేపు (శుక్రవారం) ఒక్కరోజు అమ్మవార్లు గద్దెలపై ఉంచనున్నారు. రేపు భక్తుల దర్శనం అనంతరం శనివారం మళ్లీ సమ్మక్క వనంలోకి వెళ్లనుంది.
PM Modi: మరిన్ని రైల్వేస్టేషన్ల అభివృద్ధికి మోడీ శ్రీకారం.. తెలంగాణలో ఇవే..!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కాగా, మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. జై సమ్మక్క అంటూ మేడారం పరిసరాలు మార్మోగిపోతున్నాయి. పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో మేడారం కిక్కిరిసిపోతున్నది. సమ్మక్క-సారలమ్మ నామస్మరణలతో వనం పులకరించిపోతున్నది. సమ్మక్క రాక సందర్భంగా మేడారంలోని ఆమె గుడిని శుద్ధి చేశారు. మామిడి తోరణాలు కట్టారు. ఆవరణ మొత్తం ఎర్రమన్నుతో అలికి, ముగ్గులు పెట్టారు. అమ్మవారికి మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా తల్లి గౌరవార్థం జిల్లా ఎస్పీ మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. కోయలు ప్రత్యేక పూజలు, ఆటల పాటలతో స్వాగతం పలికారు. కాగా.. ఇప్పటికే సారమ్మను ఆదివాసీ పూజారులు కొమ్మ బూరలు ఊదుతూ, డోలు వాయిద్యాలతో గద్దెపై ప్రతిష్టించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు సైతం గద్దెలపై కొలువుదీరారు. చివరగా సమక్క రాకతో జాతరలో కీలక ఘట్టం పూర్తైంది. సమక్క గద్దెపైకి చేరడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. నాలుగు రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మరోవైపు రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు రావడం పరిపాటిగా మారింది.
ఇక్కడికి వచ్చిన భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెలను దర్శించుకొంటున్నారు. ఇప్పటికే గద్దెల దగ్గర భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. మేడారం పరిసర ప్రాంతాలు గూడారాలతో నిండుకున్నాయి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?