వరంగల్ జిల్లాలో పలు ఆసుపత్రులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీన నర్సంపేట రోడ్డులోని ఎస్ఎస్ గార్డెన్లో జరిగిన ఆర్ఎంపీ, పీఎంపీల ప్రథమ మహా సభలో పలువురు వైద్యులు, జాతీయ- రాష్ట్ర వైద్య మండలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మెడికల్ కౌన్సిల్ ఆరోపించింది.
Telagana Governor Radha Krishnan: తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం రాజ్భవన్లో ప్రధాన న్యాయమూర్తి లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు.
CPI Narayana: సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే.నారాయణ స్వల్ప అనారోగ్యాన్ని గురయ్యారు. ఆయనకు పరిశీలించిన ఏఐజి డాక్టర్లు రెండు వారాలపాటు విశ్రాంతి అవసరమని సూచించారు.
Telangana Storms: రాష్ట్రంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. మెదక్ జిల్లాలో ఊయలలో ఆడుతున్న చిన్నారి ఈదురు గాలులకు ఎగిరి పక్కనే ఉన్న డాబాపై పడి మృతి చెందగా, సిద్దిపేట జిల్లాలో చెట్టు కూలడంతో టెన్త్ విద్యార్థి మృతి చెందాడు.
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీని ప్రభావం ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఉంటుందని అధికారులు వెల్లడించారు.