రాహుల్ గాంధీ కుటుంబం ప్రజలు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారని.. అధికారం కోసం అడ్డదారులు తొక్కరని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలలనేది మోడీ, అమిత్ షా విధానమని ఆయన విమర్శించారు.
ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం ఆర్ఆర్ఆర్లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్‌లోని వారి నివాసంలో కలిశారు.
ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండుగకు యుగం+ఆది 'యుగాది' లేదా 'ఉగాది' అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృత యుగం ప్రారంభమైంది కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజును మనం ఉగాదిగా జరుపుకుంటాం.
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జూన్ 8 లేదా 9న మూడో సారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. దేశం కోసం ఓటెయ్యండి.. అభివృద్ధి కోసం ఓటెయ్యండి అంటూ ప్రజలకు ఆయన సూచించారు. భారత దేశ గౌరవాన్ని పెంచడం కోసం ఓటెయ్యాలన్నారు. మోడీ ప్రధాని అయ్యేవరకు దేశం ఎలా ఉండేది.? ఆలోచించాలన్నారు.