Adilabad Rains: భానుడి భగభగలతో అల్లాడుతున్న ఆదిలాబాద్ జిల్లా వాసులకు వాన జల్లులు పలకరించాయి. ఇవాళ ఉదయం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురవడంతో నేల తల్లి తడిసింది. దీంతో ఇన్ని రోజులు తీవ్ర ఎండలతో అల్లాడుతున్న జనం చిరు జల్లులల్లో తడిసి ముద్దయ్యారు. మరోవైపు తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు తెలిపింది. ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
Read also: Himanta Biswa Sarma: పాకిస్థాన్లో అయితే.. మీ మేనిఫెస్టో కరెక్ట్‌గా సరిపోతుంది..
ఇవాళ ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో సోమవారం వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వివిధ జిల్లాల్లో మూడు రోజులుగా వర్షాలు కురిసినా.. హైదరాబాద్ లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇవాళ, రేపుతూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉగాది పండుగకు చల్లటి వాతావరణం ఏర్పడంతో ప్రజలకు కాస్త ఎండనుంచి ఊరట లభించిందనే చెప్పాలి. మరి ఈ రెండు రోజులు చిరుజల్లులతో నేల తడియడంతో రైతులకు కూడా ఇది శుభవార్తే అని చెప్పాలి.
Premalu OTT: ప్రేమలు ఓటీటీ రిలీజ్‌లో ట్విస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?