తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ఆభ్యర్ధి తాండ్ర వినోద్ రావు గెలుపును కాంక్షిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రోడ్ షో నిర్వహించారు.
గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టిన కాంగ్రెస్ జెండా వదలని ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు.
Lok Sabha Elections: తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు ఈసీ శుభవార్త చెప్పింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చని సీఈసీ వికాస్ రాజ్ తెలిపారు.
హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌ను ఇంటికి పంపించాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తరపున గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.