Lok Sabha Elections: నామినేషన్ పత్రాల్లో లెటెస్ట్ ఫోటోలు పెట్టండి లేదంటే రిజెక్ట్ చేస్తాం.. సీఈసీ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections: తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు ఈసీ శుభవార్త చెప్పింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చని సీఈసీ వికాస్ రాజ్ తెలిపారు. నామినేషన్ పత్రాల్లో లేటెస్ట్ ఫోటోలు తప్పనిసరిగా పొందుపరచాలని తెలిపారు. లేకుంటే నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తామని వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ ఫారం, అఫిడవిట్‌ను జాగ్రత్తగా నింపాలని తెలిపారు. నామినేషన్ పత్రాలు ప్రింట్ తీసి 24 ఏప్రిల్ వరకు ఆర్వోకు అందజేయాలన్నారు.
Read also: Rohit Sharma: ఆ రోజు చాలా భయపడ్డాను: రోహిత్ శర్మ
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
జాగ్రత్తగా అఫిడవిట్, నామినేషన్ పత్రాలు పూర్తి చేయాలన్నారు. ఫాం-1లో ప్రదేశం ఎక్కడ రాస్తారో అక్కడి ఆర్వోకి అందజేయాలని సూచించారు. అదే నియోజకవర్గంకు చెందిన 10 మంది ప్రపోజల్స్ సంతకాలు, వివరాలు ఉండాలని తెలిపారు. ఫా-ఏ, ఫాం-బీపై ఒరిజినల్ సంతకాలు ఉండాలని చెప్పారు. అభ్యర్థులు తాజా పాప్ పోర్ట్ సైజ్ 5 ఫోటోలు జత పర్చాలని.. గతంలో బ్యాలెట్ పత్రాల్లో తమ ఫోటో సక్రమంగా ముద్రించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. యూనిఫాంతో ఉన్న, క్యాప్, రంగుల కళ్ళజోడుతో ఉన్న ఫోటోలు, పాత ఫోటోలు కాకుండా ఇప్పటి (లేటెస్ట్) ఫోటు ఉండాలని తెలిపారు. పాత ఫోటోలు పెడితే చెల్లవని రిజెక్ట్ చేస్తామని అన్నారు. అభ్యర్థి ఖచ్చితంగా క్రిమినల్ హిస్టరీ పబ్లిష్ చెయ్యాలని చెప్పారు.
Read also: Bengaluru: కూతురి హంతకుడిని చంపిన తల్లి.. బెంగళూర్‌లో డబుల్ మర్డర్ కలకలం..
అఫిడవిట్ లో ఏ కాలంను ఖాళీగా పెట్టొద్దని, అందుకు సంబంధించిన వివరాలు రాయాల్సి ఉంటుందని వికాస్ రాజ్ వెల్లడించారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయమని ఆర్వోలను ఆదేశించామని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 17 నియోజకవర్గాల్లో 42 మంది 48 నామినేషన్లు దాఖలు చేసారు.. 5, 7048 ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి.. 19 ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు ఎన్నికల విధుల్లో నిమగ్నమైయ్యాయి. ఇప్పటి వరకు 60 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి.. మరో 100 కంపెనీల పోలీసు బలగాలు త్వరలో రాష్టానికి వస్తాయి.. వివిధ రాష్ట్రాల నుంచి 12 వేల మంది పోలీసులు బందోబస్తు కోసం వచ్చారు.. మరో 16 వేల మంది త్వరలో రాష్ట్రానికి వస్తారని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.
LSG vs CSK: సొంత ఇలాకాలో లక్నోను చెన్నై సూపర్ కింగ్స్ ఓడిస్తుందా..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!