New Aadhaar App Full Version Launched: ఆధార్ కార్డు మన రోజువారీ జీవితంలో అత్యంత కీలకంగా మారింది. బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ సేవల వరకు ఆధార్ లేకుండా ఏ పనులు జరగడంలేదు. అయితే ఆధార్‌లో చిన్న మార్పు చేయాలన్నా ఇప్పటివరకు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా UIDAI నేడు కొత్త ఆధార్ యాప్ (Aadhaar App) ఫుల్ వెర్షన్ ను లాంచ్ చేయనుంది. ఈ కొత్త యాప్ విడుదలతో కోట్లాది మందికి పెద్ద ఊరట లభించనుంది.
Ajit Pawar: సీఎం ఫడ్నవిస్‌కు మోడీ, అమిత్ షా ఫోన్.. అజిత్ పవార్ మృతిపై ఆరా
ఈ కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్‌లో యూజర్ల సౌలభ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని అనేక ఆధునిక ఫీచర్లను చేర్చనున్నారు. ఈ యాప్ ద్వారా ఆధార్‌కు సంబంధించిన అనేక పనులను ఇంటి నుంచే సులభంగా పూర్తి చేయవచ్చు. ముఖ్యంగా ఆధార్ అప్‌డేట్స్ కోసం సెంటర్లకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించారు.
ఈ ఫుల్ వెర్షన్ యాప్ లో మొత్తం 5 కీలక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా సిలెక్టివ్ షేర్ ఫీచర్ ద్వారా అవసరమైన సమాచారం మాత్రమే షేర్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల యూజర్ల ప్రైవసీ మరింత భద్రంగా ఉంటుంది. బయోమెట్రిక్స్ లాక్ ఫీచర్‌తో ఒక్క ట్యాప్‌లో పూర్తి భద్రత లభిస్తుంది.
OnePlus 16 Leaks: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, ఇంకా ఎన్నెన్నో.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేకే ఇగ!
అలాగే మరో ఫీచర్ విషయానికి వస్తే.. ఫ్యామిలీ ప్రొఫైల్ ఫీచర్ ద్వారా ఒకే మొబైల్‌లో కుటుంబ సభ్యుల ఆధార్ ప్రొఫైల్స్ ను మ్యానేజ్ చేయవచ్చు. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ ఫీచర్‌తో ఇంటర్నెట్ అవసరం లేకుండానే వ్యక్తి గుర్తింపును సురక్షితంగా వెరిఫై చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఇంట్లో అద్దెకు ఉండే వారి వివరాల పరిశీలనకు ఉపయోగపడనుంది. అలాగే ముఖ్యమైన ఫీచర్‌గా మొబైల్ నంబర్ అప్‌డేట్ సౌకర్యాన్ని అందించనున్నారు. ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ ఉపయోగించి ఇంటి నుంచే మొబైల్ నంబర్‌ను సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Digital Identity Reimagined!
A smarter and safer way to verify your identity—Aadhaar App will be dedicated to the nation today.#Aadhaar #UIDAI #AadhaarApp #DedicationtotheNation #DigitalIdentity #DigitalIndia #DigitalIdentityReimagined pic.twitter.com/XjpG4uLQLa— Aadhaar (@UIDAI) January 28, 2026
కొత్త ఆధార్ యాప్ డౌన్‌లోడ్?
ఈ కొత్త ఆధార్ యాప్‌ను అధికారికంగా గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా సింపుల్‌గా ఉండటంతో తొలిసారి వాడే వారికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.