Lok Sabha Elections 2024: తెలంగాణ సరిహద్దు, మావోయిస్టు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్ ఎంపీ స్థానాల్లో తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎంపీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.. నామినేషన్లు ఆన్లైన్ లో కూడా సమర్పించవచ్చు.. నామినేషన్ పత్రాలు ప్రింట్ తీసి 24 ఏప్రిల్ వరకు ఆర్వోకు అందజేయాలన్నారు.
104 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మన ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు.. అలాంటిది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్ సర్కార్ ను బీజేపీ వాళ్లు బతకానిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి రుణమాఫీకి ఆగస్టు 15 అంటూ జనాలను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారు అని భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయింది..ప్రభుత్వం ఉంటదో ఉడుతుందో అనే కాంగ్రెస్ వాళ్లకు భయం పట్టుకుంది..
యువకులు కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే అరవింద్ కు డిపాజిట్ కూడా రాదనీ జోస్యం చెప్పారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం గెలిస్తే దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని జీవన్ రెడ్డి తెలిపారు.
దేశంలో దళితులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. భారతీయ జనతా పార్టీ కుట్రలను తిప్పికోట్టాలి.. బీజేపీ నేతలు రామున్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.
దేవుడి పేరుతో బండి సంజయ్ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని పొన్నం ప్రభాకర్ చెప్పారు. సీట్లు ఓట్ల కోసం తల్లిని కూడా బండి సంజయ్ అవమానించాడు.. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రసాదం స్కీమ్ ను వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలకి బండి సంజయ్ ఒక్క రూపాయి తీసుకు రాలేదన్నారు.
వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో 2020- 21 సంవత్సరము వరకు వినియోగంలో ఉన్న 25 భూసార పరీక్ష కేంద్రాలను తిరిగి రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.