హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌ను ఇంటికి పంపించాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తరపున గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 10 ఏండ్లలో కేసీఆర్ తెలంగాణను దోపిడీ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ దోపిడీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రం నిధులతో జరిగిందేనని వివరించారు. తెలంగాణకు వచ్చిన విద్యా సంస్థలను హరీశ్‌రావు సిద్దిపేటకు తరలించుకుపోయారని విమర్శించారు. తెలంగాణలో ఇండ్లు, మరుగుదొడ్లు మోడీ ఇచ్చినవేనని చెప్పుకొచ్చారు. పదేండ్లు చూసింది ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని పేర్కొన్నారు. దేశంలో మోడీ రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపించాలని మెదక్ ప్రజలను గోవా సీఎం కోరారు.
ఇది కూడా చదవండి: Kiran Kumar Reddy: మంత్రి పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ సంచలన వ్యాఖ్యలు.. బహిరంగ సవాల్..
మెదక్ నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఓపెన్ టాప్‌పై తిరుగుతూ గోవా సీఎం సావంత్ ప్రజలకు అభివాదం చేశారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత శుక్రవారం ప్రారంభం కానుంది. సెకండ్ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అటు తర్వాత మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనున్నాయి. తెలంగాణలో మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇందుకోసం గురువారం నోటిషికేషన్ విడుదలైంది. ఈరోజే పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.
ఇది కూడా చదవండి: Lok Sabha Elections 2024: తెలంగాణ సరిహద్దు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రేపే ఎన్నికలు..
#WATCH | Medak, Telangana: BJP candidate from Medak, Raghunandan Rao holds a rally in the constituency.
Union Minister-state BJP chief G Kishan Reddy and Goa CM Pramod Sawant also take part in the rally. pic.twitter.com/O1ErygAeS4
— ANI (@ANI) April 18, 2024
Medak, Telangana | Goa CM & BJP leader Pramod Sawant says, "Our candidate advocate Raghunandan is winning from here. BRS and Congress candidates are corrupt. With Modi ji's blessings, we are winning this seat by many votes." pic.twitter.com/MYVjJYLIWd
— ANI (@ANI) April 18, 2024